CM Revanth Reddy: ఉద్యోగమిచ్చిన రేవంత్ రెడ్డి.. రజినీ జీతం ఎంతో తెలుసా?

హైదరాబాదులోని నాంపల్లి కి చెందిన రజిని దివ్యాంగురాలు. తనకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎక్కడా ఉద్యోగం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా ఎన్నికల ముంగిట రేవంత్ ని కలిసి తన గోడును వెల్లబోసుకున్నారు.

Written By: Dharma, Updated On : December 8, 2023 10:30 am

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి ఉద్యోగం రజిని అనే దివ్యాంగురాలు పొందిన సంగతి తెలిసిందే. ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న ఆమె ఇదివరకే రేవంత్ ను కలిశారు. ఎన్నికల ముందు రేవంత్ ను కలిసి తన దీనగాధను చెప్పుకున్నారు. దీంతో చలించి పోయిన రేవంత్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే తన హామీని నెరవేర్చారు. ఆ దివ్యాంగురాలికి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం కల్పించారు. దీంతో రజిని సైతం హైలెట్ అయ్యారు.

హైదరాబాదులోని నాంపల్లి కి చెందిన రజిని దివ్యాంగురాలు. తనకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎక్కడా ఉద్యోగం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా ఎన్నికల ముంగిట రేవంత్ ని కలిసి తన గోడును వెల్లబోసుకున్నారు. రేవంత్ అనుకున్నట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఉద్యోగ అవకాశం ఇచ్చారు. అందుకు సంబంధించి ఫైల్ పై సంతకం చేశారు. అగ్రికల్చర్ అండ్ కోపరేషన్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు పద్ధతిలో ఆమెకు ఉద్యోగం దక్కింది.

ఏకంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆమె ఉద్యోగానికి సంబంధించి ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేయడంతో అందరి దృష్టి రజిని పై మళ్లింది. ఆమెకు తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ ఏజెన్సీలో ప్రాజెక్టు మేనేజర్ గా కొలువు దక్కింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు విస్తృత ప్రచారం చేకూరింది. ముఖ్యంగా ఆమె జీతంపై రకరకాల చర్చ నడిచింది. రజిని చేసే ఉద్యోగానికి నెల జీతం రూ.50 వేలుగా తెలుస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.