Homeజాతీయ వార్తలుమోడీపై రగులుతున్న కేసీఆర్ అగ్నిపర్వతం?

మోడీపై రగులుతున్న కేసీఆర్ అగ్నిపర్వతం?

లోపల ఉడికిపోతోంది.. కానీ బద్దలు కాని పరిస్థితి. ఇప్పుడు కేంద్రం వైఖరి.. కరోనాపై మోడీ తీరు చూశాక కేసీఆర్ అగ్నిపర్వతం సలసలా కాగుతోందట.. కానీ బయటపడలేని పరిస్థితి. కష్టకాలంలో రూపాయి ఆదాయం లేక రాష్ట్రాన్ని నడిపించలేని పరిస్థితులున్నాయి.. సాయం చేయవయ్య మోడీ అంటే ఆయన చేయకపోగా ప్రతీ వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ చెప్పే సూక్తులు వింటూ కేసీఆర్ లో అసహసనం పీక్ స్టేజీలో పెరిగిపోతోందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

*రూపాయి విదిల్చని మోడీ
కరోనా లాక్ డౌన్ దెబ్బకు రాష్ట్రాలన్నీ కుదలేయ్యాయి. ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అప్పులతో నెట్టుకొస్తున్నాయి. రాష్ట్రాలన్నీ మోడీని ప్రత్యేక ప్యాకేజీ ఇయ్యండి అని కోరుతున్నా.. మోడీలో ఉలుకు లేదు.. పలుకు లేదు.. పైగా అవే కరోనా కథలు చెబుతూ ప్రతీ వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ దాటవేస్తూనే ఉన్నారన్న విమర్శలున్నాయి. కేసీఆర్ ఇది వరకే రాష్ట్రాలను ఆదుకునేందుకు హెలిక్యాప్టర్ మనీ ఇవ్వమని కోరినా మోడీ పెడచెవిన పెట్టాడు. పోనీ ఏరకంగానైనా ఆదుకోమని అంటున్నా వినడం లేదు. అందుకే తాజాగా వీడియో కాన్ఫరెన్స్ లో కేసీఆర్ కాస్త గట్టిగానే అడిగేశారట.. రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయకపోతే పరిస్థితి చేయిదాటుతుందని హెచ్చరించాడట..

*అన్నీ రాష్ట్రాలపైనే మోపుతున్న మోడీ

వలస కూలీల తరలింపు.. కరోనా టెస్టులు, కిట్స్ ఇలా కరోనా వ్యయాలన్నీ రాష్ట్రాలనే భరించాలని మోడీ మెలిక పెట్టడం కూడా రాష్ట్రాల కోపానికి కారణమవుతోంది. వలస కార్మికుల రైళ్ల చార్జీలకు కూడా డబ్బులివ్వకుండా వసూలు చేసిన వైనంపై మొన్నటి విలేకరుల సమావేశంలో కేసీఆర్ కాస్తా గట్టిగానే కేంద్రం వైఖరిని తూర్పారపట్టారు. ఇప్పటికీ కూడా కరోనా టైంలో రాష్ట్రాలకు ప్యాకేజీ విషయంలో మోడీ మీనమేషాలు లెక్కించడంపై కేసీఆర్ రగిలిపోతున్నారట..

* తేడా వస్తే కడిగేసేందుకే కేసీఆర్ రెడీ..
అప్పట్లో దేశంలో హంగ్ వస్తే ఖచ్చితంగా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ తెచ్చేవారే.. కానీ ఖర్మకాలీ దేశంలో బీజేపీ ఫుల్ మెజార్టీ రావడంతో కేసీఆర్ ఆశలు అడియాశలయ్యాయని టీఆర్ఎస్ ముఖ్యులంటున్నారు. అప్పటి నుంచి బీజేపీతో వైరం మాని స్నేహం చేస్తున్నాడు. అయినా రూపాయి విదిల్చని కేంద్రం వైఖరిపై కేసీఆర్ గుర్రుగా ఉన్నాడు. ఎక్కడైనా తేడా వస్తే కడిగేసేందుకు కేసీఆర్ కాచుకు కూర్చున్నాడు. కరోనా టైంలో కేంద్రం సాయం అవసరం కనుక ప్రస్తుతానికి గమ్మున ఉన్నాడు. ఏమాత్రం అటు ఇటు అయినా ‘మోడీ లేడు.. గీడీ లేడు’ అంటూ కేసీఆర్ ప్లేట్ ఫిరాయించడానికి రెడీగా ఉన్నాడట..

*సమయం కోసం వేచిచూస్తున్న కేసీఆర్
ప్రస్తుతం దేశం కరోనాతో విపత్కర పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రాలకు కేంద్రం సాయం అవసరం.. ఒకవేళ చేయకుంటే అన్ని రాష్ట్రాలు.. కుదిరితే దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో కలిసి కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్ యోచిస్తున్నారట.. దేశాన్ని చక్కచెట్టకుండా.. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న కేంద్రం తీరుపై సీఎంలను కూడగట్టి పోరుసల్పాలని చూస్తున్నాడట.. సమయం సందర్భం బట్టి మోడీపై పోరుకు కారాలు మిరియాలు కేసీఆర్ నూరుతున్నాడట.. సో భవిష్యత్ రాజకీయం అంత ఈజీగా ఉండదని అర్థమవుతోంది.

-నరేశ్ ఎన్నం

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular