Telangana Elections 2023: మైనారిటీల ఓట్ల కోసం దిగజారిపోయిన కేసీఆర్‌

బీజేపీని మతపిచ్చి పార్టీగా ప్రచారం చేసే బీఆర్‌ఎస్‌.. ఎన్నిల్లో గెలుపు కోసం, మైనారిటీ ఓట్ల కోసం ఘోరంగా దిగజారింది. ఇప్పటికే కులాల పేరిట ప్రజలను విడగొట్టి పాలిస్తున్న కేసీఆర్‌..

Written By: Raj Shekar, Updated On : November 25, 2023 12:20 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణలో హ్యాట్రిక్‌ కొడతా.. చరిత్రను తిరగరాస్తాం.. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరే.. బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్న మాటలు ఇవీ. ఎన్నికల ప్రచారంలో అందరికంటే ముందున్న గులాబీ నేతలు.. విజయంపై మాత్రం నమ్మకంతో లేదు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇన్నాళ్లూ రైతులు, పెన్షనర్ల ఓట్లు గంపగుత్తగా బీఆర్‌ఎస్‌కే పడతాయని విశ్వసించారు. కానీ క్రమంగా ఆ విశ్వాసం సడలుతోంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు ఇతర ఓటర్లు గుర్తొచార్చరు. కేసీఆర్‌ మైనారిటీ ఓటర్లకు గాలం వేస్తుండగా, కేటీఆర్‌ యూత్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

విభజన హామీలు..
బీజేపీని మతపిచ్చి పార్టీగా ప్రచారం చేసే బీఆర్‌ఎస్‌.. ఎన్నిల్లో గెలుపు కోసం, మైనారిటీ ఓట్ల కోసం ఘోరంగా దిగజారింది. ఇప్పటికే కులాల పేరిట ప్రజలను విడగొట్టి పాలిస్తున్న కేసీఆర్‌.. ఈసారి ఎన్నికల్లో విజయం కోసం మతాల ప్రాతిపదికన విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ దిక్కుమాలిన హామీ కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మైనారిటీ నిరుద్యోగుల కోసం ఐటీ పార్కు నిర్మిస్తామని ప్రకటించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనకంటే గొప్ప హిందువు ఎవరు అని ప్రశ్నించే కేసీఆర్‌.. మైనారిటీ ఓట్ల కోసం ఇంత దిగజారడంపై హిందువుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మైనారిటీ ఓట్లు చీలడంతోనే..
ఈసారి ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని బీఆర్‌ఎస్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో మైనారిటీ ఓట్ల పోలరైజేషన్‌లో ఆ పార్టీ కర్ణాటకలో విజయవంతమైంది. తెలంగాణలో కూడా కర్ణాటక వ్యూహాన్నే అమలు చేస్తోంది. దీంతో మైనారిటీలో చీలిపోతున్నారు. గత రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గంప గుత్తాగా పడ్డ ఓట్లు ఈసారి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య చీలిపోతున్నాయి. ఇక పాత బస్తీలోనూ బీఆర్‌ఎస్‌ మిత్రపక్షం సీట్లకు గండి పడే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ తరుణంలో కేసీఆర్‌ మైనారిటీ ఓట్ల కోసం దిగజారిపోయారు. మతం ప్రాతిపదికన ఉద్యోగాలతో ఎరవేస్తున్నారు.

అప్రమత్తంగా లేకుంటే..
ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సాధారణం. కానీ ఒక మతం వారికే ఉద్యోగాలు ఇస్తామని, అందుకోసం ప్రత్యేకంగా ఐటీ పార్కు కడతామని చెప్పడం కేసీఆర్‌ దిక్కుమాలిన ఆలోచన. ఈ టవర్‌లో మైనారిటీలే కంపెనీలు పెడతారా.. హిందువుల, క్రైస్తవులు పెట్టుబడి పెట్టరా.. హిందువులు, క్రైస్తవులకు ఉద్యోగాలు ఇవ్వరా.. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని కేసీఆర్‌ ఇంతలా భరితెగిస్తున్నారు. హిందువులకు, క్రైస్తవులకు ఐటీ పార్కు నిర్మిస్తామనే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అప్రమత్తంగా లేకుంటే.. భవిష్యత్‌లో మెజారిటీ ప్రజలే మైనారిటీలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.