సల్మాన్‌తో చేయనంటే బెదిరించారు.. కంగనా

కంగనా రనౌత్‌. బాలీవుడ్‌ క్వీన్‌. ఓ ఫైర్ బ్రాండ్‌. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన వ్యక్తి. ఏ విషయానైనా సూటిగా మొహం మీదే చెప్పేయడం ఆమె నైజం. బాలీవుడ్‌లో బడా హీరోయిలు, నిర్మాతలు, డైరెక్టర్లను ఎదిరించే ధైర్యం ఉన్న నటి. బాలీవుడ్‌లో బంధుప్రీతి మాత్రమే కాదు పురుషాధిక్యతను చాటుకోవాలనే అహంకారం కూడా దర్శక, నిర్మాతలు, హీరోల్లో ఉందని ఆమె ఆంటోంది. దానికి తానే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పిస కంగనా సంచలన […]

Written By: Neelambaram, Updated On : July 20, 2020 4:20 pm
Follow us on


కంగనా రనౌత్‌. బాలీవుడ్‌ క్వీన్‌. ఓ ఫైర్ బ్రాండ్‌. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన వ్యక్తి. ఏ విషయానైనా సూటిగా మొహం మీదే చెప్పేయడం ఆమె నైజం. బాలీవుడ్‌లో బడా హీరోయిలు, నిర్మాతలు, డైరెక్టర్లను ఎదిరించే ధైర్యం ఉన్న నటి. బాలీవుడ్‌లో బంధుప్రీతి మాత్రమే కాదు పురుషాధిక్యతను చాటుకోవాలనే అహంకారం కూడా దర్శక, నిర్మాతలు, హీరోల్లో ఉందని ఆమె ఆంటోంది. దానికి తానే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పిస కంగనా సంచలన విషయాలు బయటపెట్టింది. బాలీవడ్‌ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’ లో హీరోయిన్‌ కోసం ముందు తననే సంప్రదించారని చెప్పింది. అయితే, అందులో నటించను అన్నందుకు తనను కొందరు బెదిరించారని తెలిపింది. అయితే, వాళ్లకు భయపడకుండా తన మనసుకి నచ్చిన మరో కథలో నటించి విజయం సాధించానని చెప్పింది.

Also Read: ట్రైలర్కూ పైసలు వసూలు చేస్తున్న ఆర్జీవీ

‘సల్మాన్‌ఖాన్‌ హీరోగా రూపొందబోయే సుల్తాన్‌ సినిమాలో నటించమని అడిగారు. దీని కోసం ఆ దర్శకుడు మా ఇంటికొచ్చి కథ చెప్పారు.ఆ తర్వాత నేను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆదిత్య చోప్రాను కలిసి ఈ సినిమాలో నటించలేనని చెప్పాను. అప్పుడు ఆయన బాగానే ఉన్నారు. ఏమీ అనలేదు. కానీ, ఆ తర్వాత కంగనా సుల్తాన్‌ సినిమాకి నో చెప్పింది.. అంటూ కొన్ని వార్తలొచ్చాయి. ‘నీకెంత ధైర్యం?, నా సినిమాకే నో చెప్తావా? నీ పని అయిపోయింది’ అంటూ ఆదిత్య చోప్రా నాకు మెసేజ్‌ చేశారు. కొన్నాళ్ళ తరువాత నేను నీతో ఎప్పటికీ సినిమా చేయనని మరో మెసేజ్‌ పంపించారు’ అని కంగనా వివరించింది.

Also Read: రెండో ‘బిచ్చగాడు’ వస్తున్నాడు..

తాను సుల్తాన్‌లో నటించకపోవడానికి కారణం ఏంటో కూడా ఆమె చెప్పింది. సల్మాన్‌ లాంటి హీరో పక్కన నటించి నా ప్రాధాన్యతని తగ్గించుకోదల్చుకోలేదు అని కంగనా స్పష్టం చేసింది. సుల్తాన్‌కు నో చెప్పిన రనౌత్‌ ఆ టైమ్‌లో ‘తను వెడ్స్‌ మను’ అనే మూవీ చేసింది. అది భారీ విజయం సాధించడంతో పాటు కంగనాకు మరింత పేరు తెచ్చిపెట్టింది. దానికి సీక్వెల్‌గా రూపొందించిన ‘తను వెడ్స్‌ మను రిటర్స్న్‌’ చిత్రం కూడా హిట్‌ అయింది.

Tags