CM KCR: వడ్ల కొనుగోలు విషయంలో అటో, ఇటో తేల్చుకొని వస్తానని ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆ పనిని ఎటూ తేల్చుకోకుండానే తిరిగి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో ఆయన టూర్ ఫెయిల్ అయినట్టు అయ్యింది. అయితే సీఎం కేసీఆర్ ప్రధాని అపాయింట్‌మెంట్ కోరలేదని కేంద్ర వర్గాలు వెళ్లడించాయి. కానీ కావాలనే కేంద్ర పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఇక్కడ టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఢిల్లీకి వెళ్లివచ్చిన తరువాత సీఎం కేసీఆర్ సైలెంట్‌గా ఉంటున్నారు. ఆయన మౌనం వెనక ఉన్న పరమార్థం ఏమిటి ? బీజేపీని టార్గెట్ చేయడానికి సీఎం కేసీఆర్ ఏం ప్లాన్ చేశారని విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సీఎం మదిలో ఏముంది..
వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్రంలో గందరగోల పరిస్థితులు నెలకొంది. కేంద్రంలో ఉన్న బీజేపీ వడ్లు కొనద్దని చెబుతోందని టీఆర్ఎస్, కావాలనే రాష్ట్ర ప్రభుత్వం కొనడం లేదంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ విషయంలో రెండు పార్టీలు ఒక రోజు ముందూ, వెనక ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. టీఆర్ఎస్ మళ్లీ ఒక రోజు మహాధర్నా నిర్వహించింది. వడ్లు ఎంత మేరకు కొంటారో క్లారిటీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో ఎటూ తేల్చుకుండానే తిరిగి హైదరాబాద్ వచ్చారు. వచ్చిన నాటి నుంచి సైలెంట్ గానే ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. వీటిని తనకు, తన పార్టీకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలని అనే అంశంపై సీఎం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
బలపడుతున్న బీజేపీ..
కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి కొంత ఎదురుదెబ్బలు తగులుతున్నాయనే చెప్పవచ్చు. దుబ్బాక రఘునందన్ రావు విజయం టీఆర్ఎస్‌కు పెద్ద ఎదురుదెబ్బ. అలాగే తరువాత వచ్చిన హుజూరాబాద్ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతను తెలియజేశాయి. హుజూరాబాద్ విజయం తరువాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. అప్పటి నుంచి కొంత బీజేపీ బలపడుతూ వస్తోంది. హుజూరాబాద్ విజయంతో ఆ పార్టీ నేతలు మంచి జోష్‌లో కనిపిస్తున్నారు. దీనిని రాష్ట్రమంతా విస్తరించాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు.
Also Read: Jagan Mohan Reddy’s Big Blunder: సీఎం జగన్ పెద్ద తప్పు చేశాడా?
బీజేపీని నిలువరించేందుకు సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారనే విషయం రాజకీయ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే వడ్ల కొనుగోలు అంశం తెరపైకి వచ్చిన నాటి నుంచి బీజేపీ చాలా యాక్టివ్ గా ఉంటోంది. దానికి బ్రేక్ వేసేందుకు స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు. వరుస ప్రెస్‌మీట్‌లు పెట్టి జనం దృష్టిని తనవైపునకు మరల్చుకున్నారు. కేంద్రమే వడ్లు కొనకూడదంటూ ఆదేశాలు ఇచ్చిందని తేల్చిచెప్పారు. తప్పందా కేంద్రానిదే అని చెప్పారు. కేంద్ర బీజేపీ పెద్దలు ఒక రకంగా చెబుతుంటే, రాష్ట్ర బీజేపీ నాయకులు మరోలా మాట్లాడుతున్నారని తెలిపారు. ఆ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని చెప్పారు. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఎక్కువైంది. వరసగా ప్రెస్‌మీట్‌లు పెడుతూ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ టూర్ తరువాత బీజేపీని ఏ విధంగా ఇరకాటంలో పెట్టబోతున్నారనే విషయం ఎవరికీ అంతుబట్టడం లేదు. అయితే ప్రస్తుతం ఆయన పార్టీపైన, మంత్రి వర్గ విస్తరణపైనే దృష్టి పెట్టారని తెలుస్తోంది.
Also Read: Omricon: మహామ్మరి ‘ఒమ్రికాన్’.. అప్రమత్తంగా ఉండాల్సిందే..!