Vijayawada Engineer: కౌమార దశలో ఏం చేస్తున్నామో తెలియదు. కానీ దారులు మారుతున్నాయి. సామాజిక మాధ్యమాల ప్రభావంతో పిల్లల్లో కూడా వినూత్న పోకడలు వస్తున్నాయి. చైల్డ్ పోర్న్ వీడియోల వ్యవహారం ప్రస్తుతం ఏపీలో దుమారం రేపుతోంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. విజయవాడలో ఇంజినీరింగ్ చదువుతున్న యువకుడు చైల్డ్ పోర్న్ వీడియోల ద్వారా దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

చైల్డ్ పోర్న్ వీడియోలు అమ్ముతానంటూ పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేరే వారి దగ్గర సంబంధిత వీడియోలు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో తెలిసీ తెలియని ప్రాయంలో ఇలాంటి పనులు చేయడంతో భవిష్యత్ పై ఎలాంటి భరోసా కల్పించుకోకుండా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దిగడం దారుణం.
దీంతో సోహైల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు నాలుగు వేల చైల్డ్ పోర్న్ వీడియోలు కొనుగోలు చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. సోహైల్ ను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని విచారిస్తున్న పోలీసులకు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.
Also Read: Jagan Mohan Reddy’s Big Blunder: సీఎం జగన్ పెద్ద తప్పు చేశాడా?
చిన్న వయసులోనే ఇలా వివాదాస్పద విషయాల్లో తలదూరుస్తూ భవిష్యత్ ను అంధకారం చేసుకుంటున్న వ్యవహారంతో రాష్ర్టంలో కూడా పలువురు యువత ఇదే తీరుగా అడ్డదారుల్లో వెళుతోంది. ఈ నేపథ్యంలో సోహైల్ లాంటి యువకులు దారి తప్పుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ముందుకు వచ్చి యువతను సరైన దారిలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Omricon: మహామ్మరి ‘ఒమ్రికాన్’.. అప్రమత్తంగా ఉండాల్సిందే..!