Hyderabad: హైదరాబాద్.. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. తెలంగాణ రాష్ట్రంలో చిన్న జిల్లా అయినప్పటికి చుట్టూ ఉన్నమూడు జిల్లాల సరిహద్దులను తాకింది. హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. దేశంలో నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. మిగితా మెట్రో సిటీస్‌తో పోల్చితే ఇక్కడ లీవింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువే అని అనేక స్టడీస్ చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, వైద్యం, ఐటీ వంటి అన్ని రంగాల్లో హైదరాబాద్ ముందే ఉంటోంది. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ఏటా హైదరాబాద్ జనాభా కూడా పెరుగుతోంది.
పెరుగుతున్న విద్యుద్ డిమాండ్..
హైదరాబాద్ ప్రతీ ఏటా విస్తరిస్తోంది. ఇక్కడ జనాభాగా కూడా ప్రతీ సంవత్సరం పెరుగుతోంది. దీంతో నిర్మాణాలూ పెరుగుతున్నాయి. దీంతో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతోంది. సాధారణంగా ప్రతీ ఏటా అన్ని పెద్ద పెద్ద సిటీస్‌లో 7 నుంచి 8 శాతం డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో ఏకంగా 20 శాతం డిమాండ్ పెరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని 15 రాష్ట్రాలు కంటే మన భాగ్యనగరానికే విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉందట. హైదరాబాద్‌లో రోజు వారి డిమాండ్ వచ్చే వేసవి నాటికి 4000 మెగా వాట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అంత డిమాండ్ తీర్చాలంటే అదనపు సబ్ స్టేషన్ల నిర్మాణం, కొత్త పరికరాల కొనుగోలు అవసరం అవుతాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: Omricon: మహామ్మరి ‘ఒమ్రికాన్’.. అప్రమత్తంగా ఉండాల్సిందే..!
సబ్ స్టేషన్ల నిర్మాణం..
హైదరాబాద్‌లో జనాభా పెరగడంతో కొత్త నిర్మాణాలు కూడా పెరుగుతన్నాయి. అపార్ట్‌మెంట్ కల్చర్ వేగంగా పెరుగుతోంది. గతంలో రెండు కుటుంబాలు నివసించిన స్థలంలో ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లు కట్టి, దానిని ప్లాట్లుగా మలచి 40 కుంటుంబాలు నివసించేలా చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. గతంలో ఆ రెండు కుటుంబాలకు 1000 యూనిట్ల విద్యుత్ అవసరం కూడా ఉండకపోయేది కానీ ఇప్పుడు అదే స్థలంలో నివసించే వారికి కనీసం 20,000 వేల యూనిట్ల విద్యుత్ అవసరం అవుతోంది. దీనిని భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసమే కొత్త సబ్ స్టేషన్లను నిర్మిస్తోంది. హైదరాబాద్ పట్టణం చుట్టూ ఆరు 400 కేవీ సబ్ స్టేషన్లు నిర్మించారు. దీనికి అదనంగా 132 కేవీ సబ్ స్టేషన్లు కూడా నిర్మిస్తున్నారు. ఐటీ కారిడార్లు, ఫ్యాక్టరీలు, సాధారణ కుటుంబాలకు సరిపోయే కరెంటును అందించేందుకు వీలుగా ఈ కొత్త నిర్మాణాలను చేపడుతున్నారు. ఇప్పుడు ఉన్న సబ్ స్టేషన్లతో ఇంత విద్యుత్ డిమాండ్‌ను తీర్చడం సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం ముందు చూపుగా అవసరమైన నిర్మాణాలను చేపడుతోంది.
Also Read: BJP leader Tarun Chugh comments : తెలంగాణలో రాజకీయ కాక.. బీజేపీతో టచ్ లో ఉన్న ఆ పాతిక మంది ఎవరు?