KCR Returned From Delhi: మోడీ దెబ్బకు కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్.. అసలు కారణమిదే?

KCR Returned From Delhi: దేశంలోని బీజేపీకి ప్రత్యామ్మాయంగా.. మోడీకి ధీటైన అభ్యర్థిగా నిలిచేందుకు జాతీయ స్థాయిలో అజెండా రూపకల్పనే ధ్యేయంగా ముందుకెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ సడెన్ గా షాకిచ్చారు. పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేశాక.. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు వివిధ వర్గాలు, మేధావులతో భేటిలు.. దేశవ్యాప్త పర్యటన చేపట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ అర్థాంతరంగా హైదరాబాద్ తిరిగిరావడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈనెల 27వరకూ కేసీఆర్ ఢిల్లీలోనే […]

Written By: NARESH, Updated On : May 24, 2022 12:51 pm
Follow us on

KCR Returned From Delhi: దేశంలోని బీజేపీకి ప్రత్యామ్మాయంగా.. మోడీకి ధీటైన అభ్యర్థిగా నిలిచేందుకు జాతీయ స్థాయిలో అజెండా రూపకల్పనే ధ్యేయంగా ముందుకెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ సడెన్ గా షాకిచ్చారు. పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేశాక.. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు వివిధ వర్గాలు, మేధావులతో భేటిలు.. దేశవ్యాప్త పర్యటన చేపట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ అర్థాంతరంగా హైదరాబాద్ తిరిగిరావడం హాట్ టాపిక్ గా మారింది.

KCR

నిజానికి ఈనెల 27వరకూ కేసీఆర్ ఢిల్లీలోనే ఉండి జాతీయ రాజకీయాలపై చర్చలు జరపాలని డిసైడ్ అయ్యారు. జర్నలిస్టులు, ఆర్థికవేత్తలు.. దేశవ్యాప్తంగా తిరిగి రాజకీయ నేతలను కలవాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా వాటన్నింటిని ముగించుకొని సోమవారం రాత్రియే హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.

Also Read: YCP MLC Anantha Uday Bhaskar: మన్యంలో అరాచకాలు..వైసీపీ ఎమ్మెల్సీ దురాగతాలివీ

తెలంగాణ అప్పులపై కేంద్రం కఠిన ఆంక్షలు విధించడం.. రాష్ట్ర అధికారులు రోజులపాటు ఢిల్లీలో మకాంవేసినా కేంద్రం కనికరించలేదని సమాచారం. నిధులు లేని దుస్థితిలో ప్రాజెక్టులు ఆగిపోవడం.. పథకాలు నిలిచిపోయే పరిణామాలు తలెత్తెడంతో ఇక్కడ చేపట్టాల్సిన వ్యవహారాల కోసమే కేసీఆర్ జాతీయ ప్రణాళికను ప్రస్తుతానికి పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టేందుకే హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయగానే.. కేంద్రంలోని మోడీ సర్కార్ కొరఢా ఝలిపించింది. తెలంగాణ అప్పులపై ఆంక్షలు పెట్టింది. ఇక కేంద్రం నుంచి వచ్చే నిధులను కట్ చేసేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన కేసీఆర్ ఢిల్లీ మకాంను మార్చేశారని తెలిసింది. తెలంగాణ అధికారులు ఎవ్వరికీ కేంద్రంలోని అధికారులు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఇక అక్కడ చేసేదేం లేదని కేసీఆర్ అండ్ అధికారులు తిరిగి వచ్చినట్టు చెబుతున్నారు.

KCR

కేసీఆర్ ఢిల్లీతోపాటు 26న బెంగళూరుకు, 27న రాలేగావ్ సిద్ధికి వెల్లి దేవెగౌడ, కుమారస్వామి, అన్నాహాజరేను భేటి కావాల్సి ఉంది. 29,30న బెంగాల్, బీహార్ లో పర్యటించాల్సి ఉంది. కానీ సడెన్ గా కేసీఆర్ తన దేశవ్యాప్త పర్యటనకు బ్రేక్ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వంపై మోడీ కొట్టిన దెబ్బకు అన్నీ సర్దుకొని కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వచ్చిన పరిస్థితి నెలకొంది. అప్పుల వ్యవహారంలో కేంద్రం వైఖరి రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలోనే కేసీఆర్ ఇప్పుడు ఏం చేయనున్నారని ఆసక్తిగా మారింది.. మోడీపై కఠిన వైఖరి ఎత్తుకునేలా ప్లాన్ లు సిద్ధం చేయబోతున్నారని తెలిసింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తే.. కేంద్రం ఇటువైపు నరక్కువచ్చింది.. అందుకే వెంటనే కేసీఆర్ ఢిల్లీ వదిలి వచ్చారని ప్రచారం సాగుతోంది.

Also Read:Revanth Reddy: కేసీఆర్ దున్నపోతు కంటే అధ్వానంగా అయ్యాడు: రేవంత్ రెడ్డి
Recommended videos


Tags