Dalitha bandhu: దళితబంధు.. కేసీఆర్ వరాల విందు

హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన ‘దళితబంధు’ పథకాన్ని ఎట్టకేలకు ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో దళిత కుటుంబాలకు తన చేతుల మీదుగా స్వయంగా రూ.10 లక్షల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా దళితబంధును విజయవంతం చేసే బాధ్యత ఎస్సీ విద్యార్థులపై ఉంది. నూటికి నూరు శాతం దళితబంధును అమలు చేస్తాం అని కేసీఆర్ హుజూరాబాద్ వేదికగా ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 21వేల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయిని.. నియోజకవర్గంలోని […]

Written By: NARESH, Updated On : August 16, 2021 5:04 pm
Follow us on

హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన ‘దళితబంధు’ పథకాన్ని ఎట్టకేలకు ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో దళిత కుటుంబాలకు తన చేతుల మీదుగా స్వయంగా రూ.10 లక్షల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా దళితబంధును విజయవంతం చేసే బాధ్యత ఎస్సీ విద్యార్థులపై ఉంది. నూటికి నూరు శాతం దళితబంధును అమలు చేస్తాం అని కేసీఆర్ హుజూరాబాద్ వేదికగా ప్రకటించారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో 21వేల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయిని.. నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. 25 ఏళ్ల క్రితం నుంచే ఎస్సీల కోసం నా మస్తిష్కంలో ఎన్నో పథకాలు ఉన్నాయని.. కాంగ్రెస్, బీజేపీ ప్రధానులు ఇలాంటి పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు అని కేసీఆర్ నిలదీశాడు. ఇప్పటివరకు ఆలోచన చేయని నేతలు ఇవాళ విమర్శలు చేస్తున్నారు.

ఇక సీఎం కేసీఆర్ మరో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు వర్తింప చేస్తామని సగర్వంగా ప్రకటించారు. చివరి వరుసలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇష్తామని తెలిపారు.

ఎస్సీలలో నిరుపేదలకు ముందుగా దళితబంధు నిధులు ఇస్తామని.. అతి తక్కువ ఉపాధి, ఆదాయం ఉన్నవారు ఎస్సీలని.. వారి పట్ల వివక్ష లేకుండా ఈ పథకం మంజూరు చేసినట్లు తెలిపారు. 15 రోజుల్లో ఈ పథకం కోసం మరో రూ.2వేల కోట్లు మంజూరు చేస్తున్నానని కేసీఆర్ హుజూరాబాద్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా దళిత ఐఏఎస్ రాహుల్ బొజ్జాను సీఎంవోలో దీన్ని పర్యవేక్షణకు నియమిస్తున్నట్టు తెలిపారు.

దళితబంధు రూ.10లక్షలతో నచ్చిన పని చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వయం ఉపాధి పనులు, వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు. 100శాతం సబ్సిడీతో ఇస్తామని దళితులకు హామీ ఇచ్చారు.