CM KCR: ఎన్నికలకు ప‌క్కా వ్యూహం.. జిల్లాలకు కొత్త బాసులు.. కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌..

CM KCR: రాష్ట్రంలో ఎదురులేని పార్టీగా దూసుకుపోతున్న టీఆర్ఎస్.. కొద్ది రోజులుగా చేదు అనుభవాలను ఎదురుకొంటోంది. దీంతో పార్టీని పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ప్రణాళికలు రూపొందిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఇన్ని రోజులు కేంద్రంలోని బీజేపీతో ఫ్రెండ్ షిప్ మెయిన్‌టెన్ చేసిన టీఆర్ఎస్.. ప్రస్తుతం బీజేపీతో అమీతుమీ తేల్చుకుంటామని ప్రకటించింది. దీంతో బీజేపీకి రాష్ట్రంలో ఛాన్స్ ఇవ్వకుండా టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు గులాబీ బాస్ పక్కా […]

Written By: Mallesh, Updated On : January 26, 2022 3:53 pm
Follow us on

CM KCR: రాష్ట్రంలో ఎదురులేని పార్టీగా దూసుకుపోతున్న టీఆర్ఎస్.. కొద్ది రోజులుగా చేదు అనుభవాలను ఎదురుకొంటోంది. దీంతో పార్టీని పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ప్రణాళికలు రూపొందిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఇన్ని రోజులు కేంద్రంలోని బీజేపీతో ఫ్రెండ్ షిప్ మెయిన్‌టెన్ చేసిన టీఆర్ఎస్.. ప్రస్తుతం బీజేపీతో అమీతుమీ తేల్చుకుంటామని ప్రకటించింది.

CM KCR

దీంతో బీజేపీకి రాష్ట్రంలో ఛాన్స్ ఇవ్వకుండా టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు గులాబీ బాస్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. జిల్లాల్లోనూ బీజేపీ నాయకులు చేసే ఆరోపణలకు కౌంటర్ వేసేందుకు టీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షులు లేకపోవడంతో పార్టీ అంతకంతకూ వెనకబడిపోతోంది. దీంతో 33 జిల్లాలకు ఒకే సారి అధ్యక్షులను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పార్టీపై అసంతృప్తి ఉన్న నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు.

తాజాగా నియమించిన అధ్యక్షులల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న (ఆదిలాబాద్), ఎమ్మెల్యే కోనప్ప (కొమురం భీమ్ ఆసిఫాబాద్) ఎమ్మెల్యే సుమన్ (మంచిర్యాల), ఎమ్మెల్యే విఠల్ (నిర్మల్), ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (నిజామాబాద్) మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్ (కామారెడ్డి), సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు (కరీంనగర్), మాజీ ఎంపీపీ తోట ఆగయ్య (రాజన్న సిరిసిల్ల), ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు (జగిత్యాల), ఎమ్మెల్యే కోరుకంటి చందర్ (పెద్దపల్లి) కి బాధ్యతలు అప్పగించారు.

Also Read: టీఆర్ఎస్, బీజేపీ మధ్య విభేదాలు పెరుగుతున్నాయా?

ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి (మెదక్), మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (సంగారెడ్డి), ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (సిద్దిపేట) ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ (వరంగల్), ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (హనుమకొండ), జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి (జనగామ), ఎంపీ మాలోతు కవిత (మహబూబాబాద్) ములుగు జెడ్పీ చైర్మన్ జగదీశ్ (ములుగు), జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి (జయశంకర్ భూపాలపల్లి), ఎమ్మెల్సీ తాతామధుసూదన్ (ఖమ్మం), ఎమ్మెల్యే రేగా కాంతారావు (భద్రాద్రి కొత్తగూడెం) ఎమ్మెల్యే రవీంద్రకుమార్ (నల్లగొండ) బడుగుల లింగయ్య యాదవ్ (సూర్యాపేట), ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి (యాదాద్రి భువనగిరి), ఎమ్మెల్యే కిషన్ రెడ్డి (రంగారెడ్డి) ఎమ్మెల్యే మెతుకు ఆనందర్ (వికారాబాద్), ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు (మేడ్చల్), ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్), ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (నాగర్ కర్నూల్), ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (జోగులాంబ), ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి (నారాయణపేట), మున్సిపల్ చైర్మన్ ఏర్పుల గట్టుయాదవ్ (వనపర్తి), ఎమ్మెల్యే గోపినాథ్ (హైదరాబాద్)ను నియమించారు.

Also Read: గజ్వేల్ లో పోటీచేయవద్దని కేసీఆర్ డిసైడ్ అయ్యాడా? అందుకే భయపడుతున్నాడా?

Tags