Kitchen Tips: ఆహార పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే ఫ్రిజ్ లో పెట్టాలనే సంగతి తెలిసిందే. దేశంలో రోజురోజుకు ఫ్రిజ్ లను వినియోగించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఫ్రిజ్ లో కొన్ని ఆహార పదార్థాలను పెట్టడం ద్వారా ఆ ఆహార పదార్థాలు విషంగా మారే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. అరటిపండ్లను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు.
ఫ్రిజ్ లో అరటిపండ్లను ఉంచితే ఆ అరటిపండ్లు నల్లగా మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి అరటిపండ్లను తినడం వల్ల జలుబుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఐతే ఉంటాయి. కొంతమంది నూనెలను కూడా ఫ్రిజ్ లో పెడుతుంటారు. నట్ బేస్డ్ ఆయిల్స్ ఫ్రిజ్ లో పెట్టినా ఎటువంటి సమస్య ఉండదు. ఇతర నూనెలను ఫ్రిజ్ లో పెడితే మాత్రం మంచిది కాదు.
Also Read: నిమ్మగడ్డి సాగుతో సులువుగా లక్షల్లో సంపాదించవచ్చు.. ఎలా అంటే?
తేనె తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. అయితే ఫ్రిజ్ లో తేనెను పెడితే మాత్రం మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అందువల్ల ఫ్రిజ్ లో తేనెను ఉంచడం కాదు. వెల్లుల్లిని కూడా ఫ్రిజ్ లో ఉంచడం సరి కాదు. వెల్లుల్లిని వేడి లేదా చల్లని వాతావరణంలో ఉంచితే రుచి మారుతుంది. అందువల్ల వెల్లుల్లిని ఫ్రిజ్ లో ఉంచకూడదు.
బంగాళదుంపలను కూడా ఫ్రిజ్ లో ఉంచడం ఏ మాత్రం ఆరోగ్యకరం కాదు. ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో ఉంచకూడదు. కొన్నిసార్లు ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల ప్రాణాలకే అపాయం కలిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో ఉంచే అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును మార్చుకుంటే మంచిది.
Also Read: బక్కగా ఉన్నారా.. బలంగా మారాలంటే తినాల్సిన ఆహార పదార్థాలివే?