KCR BRS: దేశంలో బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఇక కేసీఆర్ ‘బీఆర్ఎస్’..

KCR BRS: తెలంగాణ రాష్ట్రం సాధిస్తానని బయలు దేరినప్పుడు కేసీఆర్ ను చూసి అందరూ నవ్వారు. ఎందుకంటే ఆ సమయంలో చంద్రబాబు, వైఎస్ఆర్ లాంటి ఉద్దండులు ఉన్నారు. వారిని ఎదురించి నిలబడడం కేసీఆర్ తో కాదనుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే కేసీఆర్, టీఆర్ఎస్ ఉండేది కాదు.. తెలంగాణ వచ్చి ఉండేది కాదన్న ప్రచారం ఉండేది. కానీ కాలం కలిసివచ్చి తెలంగాణ వచ్చింది కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ అదే చేస్తానని కేసీఆర్ […]

Written By: NARESH, Updated On : September 9, 2022 12:00 pm
Follow us on

KCR BRS: తెలంగాణ రాష్ట్రం సాధిస్తానని బయలు దేరినప్పుడు కేసీఆర్ ను చూసి అందరూ నవ్వారు. ఎందుకంటే ఆ సమయంలో చంద్రబాబు, వైఎస్ఆర్ లాంటి ఉద్దండులు ఉన్నారు. వారిని ఎదురించి నిలబడడం కేసీఆర్ తో కాదనుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే కేసీఆర్, టీఆర్ఎస్ ఉండేది కాదు.. తెలంగాణ వచ్చి ఉండేది కాదన్న ప్రచారం ఉండేది. కానీ కాలం కలిసివచ్చి తెలంగాణ వచ్చింది కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ అదే చేస్తానని కేసీఆర్ బయలు దేరుతున్నారు.

ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేయడానికి రెడీ అయ్యారు. త్వరంలోనే జాతీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో ఉండాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు వేదిక కూడా ఖరారు అయినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన చేయడానికి కేసీఆర్ నిర్ణయించారు.. ఈనెల 11వ తేదీన హైదరాబాద్ కు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి రాబోతున్నారు. ఈ సందర్భంగా జాతీయ పార్టీపై కీలక చర్చలు నిర్వహించనున్నారు. ఇక జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే ఫ్రంట్ లు అలాగే పొత్తులపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

బీజేపీని దేశంలో గద్దెదించడమే ధ్యేయంగా కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యటించారు. ఇటీవల బీహార్ లోనూ పర్యటించి సీఎం నితీష్ తో సమావేశమయ్యారు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్, కర్నాటక, తమిళనాడు సీఎం, ఇతర నేతలతోనూ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, నేతలను కలుస్తున్నారు.వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు.ముందుగా జాతీయ స్థాయిలో నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ నేతలతో నిరంతరం టచ్ లో ఉంటూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.

ఢిల్లీ కేంద్రంగా కార్యాచరణ ఉన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగానే తాను కొనసాగాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నికల ఫలితాల తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది.