https://oktelugu.com/

రఘురామకృష్ణం రాజు ఆటలో అరటిపండు అయ్యాడా?

ఎగిరెగిరి పడితే ఏమవుతుందో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఇప్పుడు బాగా అర్థమవుతోందట.. ఉత్తిపుణ్యానికి మీడియాలో అవాకులు చెవాకులు పేలితే ఇప్పుడు మూల్యం చెల్లించించుకోవాల్సి వచ్చిందని ఆయన తెగ బాధపడుతున్నాడట.. టీడీపీ అనుకూల మీడియా చేసిన మోసానికి తను అన్యాయమైపోయానని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేస్తాం.. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అంటే ఇదే మరీ.. అధికార వైసీపీలో ఎంపీగా రఘురామకు ఎంతో గౌరవం. పైగా పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యుడిగా ఎన్నికై […]

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2020 3:11 pm
    Follow us on


    ఎగిరెగిరి పడితే ఏమవుతుందో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఇప్పుడు బాగా అర్థమవుతోందట.. ఉత్తిపుణ్యానికి మీడియాలో అవాకులు చెవాకులు పేలితే ఇప్పుడు మూల్యం చెల్లించించుకోవాల్సి వచ్చిందని ఆయన తెగ బాధపడుతున్నాడట.. టీడీపీ అనుకూల మీడియా చేసిన మోసానికి తను అన్యాయమైపోయానని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఏం చేస్తాం.. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అంటే ఇదే మరీ.. అధికార వైసీపీలో ఎంపీగా రఘురామకు ఎంతో గౌరవం. పైగా పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యుడిగా ఎన్నికై బీజేపీ మోడీ, అమిత్ షాలకు దగ్గరయ్యాడు. అదే ఆయన పొగరుకు కారణమై ఇప్పుడు ఉన్న పదవి ఊస్టయ్యే పరిస్థితికి తెచ్చుకున్నాడట..

    తొలి వాక్సిన్ భారత్ నుంచే రానుందా?

    నిజానికి రఘురామకృష్ణం రాజు అన్నది తక్కువ. ఆయనను అనిపించింది ఎక్కువ. టీడీపీ , ఆ పార్టీ అనుకూల మీడియా ఆడిన ఆటలో పాపం రఘురామకృష్ణం రాజు బలిపశువు అయ్యాడనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

    వైసీపీలో కాస్తా ధిక్కార స్వరం వినిపించగానే టీడీపీ అనుకూల మీడియా రఘురామను పట్టేసుకుంది. ఆయన తొలిసారి ఎంపీ అయినా.. సీనియర్ ఎంపీ కాకపోయినా ఆయనను హైలెట్ చేస్తూ.. చిలువలు పలువలు చేసింది. ఎందుకంటే జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. ఆయనపై రాళ్లేద్దామంటే కుదరడం లేదు. దీంతో ఏదో ఒక విధంగా జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రఘురామకృష్ణం రాజును ఆయుధంగా వాడి లైవ్ డిబేట్లోకి తీసుకొచ్చింది టీడీపీ అనుకూల మీడియా. ఏదో ఒక విధంగా రఘురామను రెచ్చగొట్టే ప్రశ్నలు వేసి వైసీపీ పార్టీపై.. ఎమ్మెల్యేలు , మంత్రుల మీద వ్యతిరేకంగా మాట్లాడేటట్టు చేసి సక్సెస్ అయ్యింది. ఆ కుట్ర తెలియని ఎంపీ రఘురామ పాపం ఆ ట్రాప్ లో పడి నోరుపారేసుకున్నాడు. దీంతో వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యి స్పీకర్ కి ఫిర్యాదు చేసేవరకు టీడీపీ అనుకూల మీడియా ఆయనను వదలకుండా రచ్చ చేసింది.

    ఇళ్ల స్థలాల పంపిణీకి వాయిదాకు కారణం ఇదేనా..!

    కట్ చేస్తే.. ఇప్పుడు రఘురామకృష్ణం రాజు ఊసే మీడియాలో లేకుండా పోయింది. గత మూడు రోజుల నుంచి రఘురామకృష్ణం రాజును టీడీపీ అనుకూల మీడియా పట్టించుకోవడంలేదు.పుణ్యకార్యం కాస్తా కావడంతో ఇక ఆయనను గంగలో కలిపింది. ఇప్పుడు మీడియాలో చూపించకుండా రఘురామను తొక్కేస్తున్నారు. అతడితో పని అయిపోవడంతో టీడీపీ అనుకూల మీడియా వదిలేసింది.. ఈ మొత్తం వ్యవహారంలో పాపం టీడీపీ అనుకూల మీడియా కుట్రలు తెలియక రఘురామకృష్ణం రాజు బలిపశువు అయ్యారని మీడియా సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. వారి కుట్రలు తెలుసుకోకుండా విమర్శించి రఘురామ ఇప్పుడు ఎంపీ పదవిని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాడంటున్నారు.