జగన్ వదిలేశాడు.. కేసీఆర్ ఉపయోగించుకున్నాడు

అదో అందివచ్చిన అవకాశం.. చీఫ్ జస్టిస్ అంటే దేశ అత్యున్నత న్యాయస్థానానికి పెద్దమనిషి. అలాంటి ఆయన ఎంతో శక్తివంతుడు. ఎన్నో కేసుల తలరాతలను మార్చగలడు. అయితే ఆయన మెప్పు కోసం ప్రధాని నుంచి సీఎంల వరకు గౌరవం ఇచ్చి సత్కరిస్తారు. తమ కేసులు, రాజకీయాలు, ప్రభుత్వాల పనితీరు విషయంలో సుప్రీంకోర్టు అండదండలు ఉండాలని నేతలు కోరుకుంటారు. కానీ ఈ విషయంలో వైరం పెంచుకొని సీఎం జగన్ దూరం కాగా.. చీఫ్ జస్టిస్ ను ఘనంగా సత్కరించి కేసీఆర్ […]

Written By: Srinivas, Updated On : June 12, 2021 9:45 am
Follow us on

అదో అందివచ్చిన అవకాశం.. చీఫ్ జస్టిస్ అంటే దేశ అత్యున్నత న్యాయస్థానానికి పెద్దమనిషి. అలాంటి ఆయన ఎంతో శక్తివంతుడు. ఎన్నో కేసుల తలరాతలను మార్చగలడు. అయితే ఆయన మెప్పు కోసం ప్రధాని నుంచి సీఎంల వరకు గౌరవం ఇచ్చి సత్కరిస్తారు. తమ కేసులు, రాజకీయాలు, ప్రభుత్వాల పనితీరు విషయంలో సుప్రీంకోర్టు అండదండలు ఉండాలని నేతలు కోరుకుంటారు. కానీ ఈ విషయంలో వైరం పెంచుకొని సీఎం జగన్ దూరం కాగా.. చీఫ్ జస్టిస్ ను ఘనంగా సత్కరించి కేసీఆర్ ఆయన వద్ద మంచి మార్కులు కొట్టేశాడనే చెప్పొచ్చు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు విమానాశ్రయంలో, బస చేసే రాజ్ భవన్ లో స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున వీఐపీలు తరలి వెళ్లారు. ప్రొటోకాల్ ప్రకారం వెళ్లాల్సిన వారే కాకుండా అధికార బాధ్యతల్లో ఉన్న మంత్రులు,ఉన్నతాధికారులు హాజరయ్యారు. అధికార వర్గాల్లో సీజేఐ రాక సందడి కనిపించింది.

రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. చాలా కాలం తరువాత తెలుగు వ్యక్తి సీజేఐ కావడంతో అందరిలో ఉత్సాహం కనిపించింది. చీఫ్ జస్టిస్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రాలేదు. ఆయన మొదట ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చారు. కానీ ఏపీలో ఎక్కడా హడావిడి కనిపించలేదు.

ప్రొటోకాల్ ప్రకారం కూడా వీఐపీలు పెద్దగా కనిపించలేదు. ముఖ్యమంత్రి జగన్ సీజేఐ వచ్చే సమయానికికంటే ముందుగానే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత అమరావతి వచ్చారు. రెండు చోట్ల ఆహ్వానాలు, స్వాగతాలు రెండు రోజుల్లోనే జరగడంతో కంపేరిజన్ ఎక్కువగా వస్తోంది.

ఈ విషయంలో ఎన్వీ రమణ సీజేఐగా ఖరారు కాకముందు జరిగిన పరిణామాలను కొంతమంది గుర్తు చేస్తున్నారు. ఎన్వీ రమణ సీజేఐ కాకుండా ఓ వైపు జడ్జి రామకృష్ణ వైపు నుంచి ఆరోపణలు చేయించడానికి మరో వైపు స్వయంగా సీఎం జగన్ ఆరోపణలు చేస్తూ లేఖ రాయడాన్ని కొంతమంది గుర్తు చేసుకున్నారు. ఈక్రమంలో ఏపీ సర్కారుకు ఇష్టం లేనందునే తెలంగాణ స్థాయిలో స్వాగతాలు దక్కలేదని అంచనా వేస్తున్నారు.