https://oktelugu.com/

CM KCR: పదవుల పందేరం చేసిన కేసీఆర్.. ఎవరెవరికి ఏ పోస్టు అంటే?

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేషన్లకు కొత్తగా చైర్మన్ల నియామకం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో అలకబూనిన వారికి పదవులు అప్పగిస్తూ వారిని పనిలో నిమగ్నం అయ్యేలా చూస్తున్నారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్జెల నగేశ్, స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 17, 2021 / 04:40 PM IST
    Follow us on

    CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేషన్లకు కొత్తగా చైర్మన్ల నియామకం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో అలకబూనిన వారికి పదవులు అప్పగిస్తూ వారిని పనిలో నిమగ్నం అయ్యేలా చూస్తున్నారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్జెల నగేశ్, స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా పాటిమీది జగన్మోహన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్, షీప్ అండ్ గోట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ా దూదిమెట్ల బాలరాజు యాదవ్ లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

    CM KCR

    ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను రాష్ర్ట వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా, టీఆర్ఎస్ సామాజిక విభాగం నేత మన్నె క్రిశాంక్ ను రాష్ర్ట ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా, ధూంధాం కళాకారుడు, గాయకుడు వేద సాయిచంద్ ను రాష్ర్ట గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నియమించేందుకు రంగం సిద్ధమైంది.

    రాష్ర్ట ప్రభుత్వం రాష్ర్టంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఆశావహులను ఏదో ఒక పదవిలో నియమించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి వారికి ఏదో ఒక బాధ్యత అప్పగించి వారి సేవలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. దీంతో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధినేత కేసీఆర్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    Also Read: Bhadradi Kothagudem: గతి తప్పిన టీచర్లు.. గురుకులంలో ఏకాంతంగా ఇద్దరు ఉపాధ్యాయులు

    ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీని గాడిలో పెట్టే పనిలో సీఎం కేసీఆర్ నిమగ్నమైనట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన సందర్భంలో కేసీఆర్ నేతల భవిష్యత్ పై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే వారికి నామినేటెడ్ పదవులు అప్పగించేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన ఇన్ని రోజులకైనా సీఎం కేసీఆర్ కు నామినేటెడ్ పదవుల భర్తీపై ఆలోచన రావడం మంచిదే. దీంతో నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది.

    Also Read: D Srinivas: డీఎస్ రాకతో కాంగ్రెస్ బలపడుతుందా?

    Tags