Pushpa Movie: వాళ్ళల్లో మరో వాణిశ్రీ, బ్రహ్మానందం.. గొప్ప నటులయ్యేది చిన్న పాత్రలతోనే !

Pushpa Movie: తెలుగు వెండితెర పై మెరుపులు మెరిపించాలి అంటే.. కిందిస్థాయి నుంచి ఎదగాల్సిందే. అప్పుడే నటన పై పట్టు వస్తోంది. ఎందుకంటే ఎదిగే క్రమంలోనే తెలుస్తోంది. మనిషికి ఎదుగుదల ఎంత అవసరమో అని. అలాగే జీవితంలో ఎదగలేక పోతే తోటి మనుషుల నుంచే ఎంతగా మనిషి ఇబ్బంది పడాల్సి వస్తోందో అని. పైగా, చిన్న స్థాయి నుంచి ఎదిగే వారికి లాంగ్ లైఫ్ ఉంటుంది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ సైతం మన దేశం అనే సినిమాలో […]

Written By: Shiva, Updated On : December 17, 2021 8:21 pm
Follow us on

Pushpa Movie: తెలుగు వెండితెర పై మెరుపులు మెరిపించాలి అంటే.. కిందిస్థాయి నుంచి ఎదగాల్సిందే. అప్పుడే నటన పై పట్టు వస్తోంది. ఎందుకంటే ఎదిగే క్రమంలోనే తెలుస్తోంది. మనిషికి ఎదుగుదల ఎంత అవసరమో అని. అలాగే జీవితంలో ఎదగలేక పోతే తోటి మనుషుల నుంచే ఎంతగా మనిషి ఇబ్బంది పడాల్సి వస్తోందో అని. పైగా, చిన్న స్థాయి నుంచి ఎదిగే వారికి లాంగ్ లైఫ్ ఉంటుంది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ సైతం మన దేశం అనే సినిమాలో చిన్న పాత్రతోనే తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

Pushpa Movie

నేడు పాపులర్ నటీనటుల్లో ఎందరో చిన్న చిన్న పాత్రలు పోషించి గొప్ప స్థాయికి వచ్చారు. అలనాటి హీరోలు శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇక మెగాస్టార్ దగ్గర నుంచి విజయ్ దేవరకొండ వరకూ ఎందరో స్టార్లు చిన్న పాత్రలతోనే ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిన్న చిన్న పాత్రలు వేసే, ఇప్పుడు సుప్రసిద్ధులైన నటీనటులుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.

మెగాస్టార్ ‘పసివాడి ప్రాణం’ సినిమాలో నేటి ‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం గారు అర నిమిషం లోపు కనిపించే పాత్రలో నటించారు. చిరు తన దారిన తాను వెళ్తుంటే, బ్రహ్మానందం చేతి కర్ర సాయంతో నడవలేక నడుస్తూ ఎదురు వస్తాడు. చిరంజీవి వైపు కోపంగా చూసి వెళ్ళిపోతాడు. అంతే, ఆ పాత్ర ప్రాముఖ్యత. కానీ ఆ తర్వాత బ్రహ్మానందం చుట్టూ కథలను నడిపి సూపర్ స్టార్లు, మెగాస్టార్లు సైతం హిట్లు అందుకున్నారు.

అలాగే నటీమణులలో కూడా చిన్న పాత్రలతో అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఒకప్పటి అందాల తార వాణిశ్రీ గారు కూడా మొదట్లో ‘మంగమ్మ శపధ౦’ అనే సినిమాలో చిన్న చెలికత్తె వేషం వేశారు. ఆ సినిమాలో హీరోయిన్ జమునను కారాగారంలో బంధించినప్పుడు వాణిశ్రీ ఆమెకు ఆహారం తీసుకువెళ్తుంది. అంతే, ఆ పాత్ర నిడివి.

Also Read: Pawan Kalyan: మరో రీమేక్ చిత్రానికి రెడీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…

ఒక విధంగా అప్పట్లో వాణిశ్రీ చేసిన జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర అది. కానీ, ఆ తర్వాత ఆమె అగ్రనటి అయింది. తనదైన శైలిలో తెలుగు తెరకు గ్లామర్ ను అద్దింది. అందుకే, చిన్న పాత్రల్లో కనిపించే నటీనటులు కూడా గొప్ప వాళ్ళుగా ఎదగొచ్చు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. నేడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప సినిమాలో ఏకంగా 75 మంది నూతన నటీనటులు చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. మరి వాళ్ళల్లో కూడా మరో వాణిశ్రీ, బ్రహ్మానందం ఉండొచ్చు, వాళ్ళు కూడా భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్లాలని ఆశిద్దాం.

Also Read: RRR Movie: రామ్, రామారావు ల కొత్త ఫోటోలు రిలీజ్ చేసిన “ఆర్‌ఆర్‌ఆర్” యూనిట్…

Tags