CM KCR: దళితబంధు పథకంపై ప్రభుత్వం పక్కా ప్రణాళికతోనే ఉంది. ఈ మేరకు కేసీఆర్ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు. 1986లోనే ఈ పథకం రూపుదిద్దుకుందని తెలిపారు. స్వాతంత్ర్యం తరువాత కూడా దళితుల అభివృద్ధి జరగడం లేదు. దీంతో వారి కోసం చేపట్టిన పథకమే దళితబంధు. గత కొన్నేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటున్నా ఏ కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. దీంతో దళితుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేందుకు సర్కారు సుముఖత వ్యక్తం చేస్తోంది.

వచ్చే ఏడాది మార్చి లోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. సుమారు రూ.3 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే పది లక్షలతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎలాంటి ఆంక్షలు లేవు. నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేసి వారికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది.
వచ్చే బడ్జెట్ లో నియోజకవర్గానికి రెండు వేల మందికి దళితబంధు అందజేసేందుకు సిద్ధమవుతోంది. రూ.4 వేల కోట్లతో రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ఇంత రాద్దాంతం చేయడం అవసరమా? అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దళితబంధు నిధులు మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ర్టమంతా దళితబంధు అమలు చేస్తే రూ.1.80 లక్షల కోట్లు అవసరమవుతాయి.
హైదరాబాద్ మినహా ప్రతి జిల్లాలో 20 శాతం దళితులున్నారు. రాష్ర్టంలో సగటున 17.53 శాతం ఎస్సీల జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో 80 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ర్టం సుముఖంగా ఉంది. నిరుద్యోగుల సమస్య తీర్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో నిరుద్యోగులకు తీపి కబురు అందినట్లవుతోంది. దళితబంధు పథకం రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి అందరి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేందుకు మార్గం సుగమం చేస్తోంది.