Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న మళయాలి సినిమా ‘అయ్యప్పనుం కోషియుం’. ఈ సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఖరారు అయింది. అక్టోబర్ 15 న రిలీజ్ చేయబోతున్నారు. పైగా ఈ పాట ఒక రొమాంటిక్ సాంగ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సతీమణిగా నిత్య మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, సెకండ్ సింగిల్ గురించి ఎనౌన్స్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ – నిత్య మీనన్ పై ఒక స్టిల్ వదిలారు. ఈ స్టిల్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. పోస్టర్ లో నిత్యా మీనన్ ఫార్మల్ పంజాబీ డ్రెస్ లో కనిపించగా.. పవన్ కళ్యాణ్ కూడా ఫార్మల్ లుక్ లో కనిపించాడు. ఇక భీమ్లా నాయక్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కూడా బాగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ పై ఫస్ట్ సింగిల్ ను బాగా డిజైన్ చేశారు.
అలాగే భీమ్లా నాయక్ ఫస్ట్ టీజర్ కూడా పవన్ పై స్పెషల్ గా కంపోజ్ చేయడం, ముఖ్యంగా పవన్ చాలా ఆవేశంగా నడుచుకుంటూ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. మొత్తానికి భీమ్లా నాయక్ గా పవన్ , డ్యానియల్ శేఖర్ గా రానా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఈ సినిమా ఈగో మీద నడవబోతుంది. నువ్వా – నేనా అంటూ పోటీ పడే ఇద్దరి ఆవేశపరుల కథ ఇది.
ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12, 2021కి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను తెలుగులో దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ కూడా పని చేస్తున్నాడు. ఇక పవన్, ఈ సినిమాని పూర్తి చేసిన తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో రానున్న భారీ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు.