https://oktelugu.com/

వెరైటీగా జగన్ ఢిల్లీ టూర్?

ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండురోజుల పాటు సాగింది. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతోపాటు అమిత్ షాతో గంటన్నర పాట భేటీ అయ్యారు. ఆయన పర్యటనపై అందరిలో ఆసక్తి నెలకొంది. రాష్ర్ట సంక్షేమంపై కాకుండా సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వెళ్లారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈనేపథ్యంలో జగన్ బిజీగా గడిపారు. రాష్ర్ట ప్రయోజనాల కోసమే తాను పర్యటన చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. జగన్ ఢిల్లీ పర్యటనలో సంప్రదాయానికి భిన్నంగా కనిపించారు. తాడేపల్లిలోనే […]

Written By: , Updated On : June 11, 2021 / 04:35 PM IST
Follow us on

jaganఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండురోజుల పాటు సాగింది. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతోపాటు అమిత్ షాతో గంటన్నర పాట భేటీ అయ్యారు. ఆయన పర్యటనపై అందరిలో ఆసక్తి నెలకొంది. రాష్ర్ట సంక్షేమంపై కాకుండా సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వెళ్లారని ప్రతిపక్షాలు విమర్శించాయి.

ఈనేపథ్యంలో జగన్ బిజీగా గడిపారు. రాష్ర్ట ప్రయోజనాల కోసమే తాను పర్యటన చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. జగన్ ఢిల్లీ పర్యటనలో సంప్రదాయానికి భిన్నంగా కనిపించారు. తాడేపల్లిలోనే కాదు అధికారిక కార్యక్రమాల్లో సైతం ముఖానికి మాస్కు పెట్టడం తెలిసిందే. అందుకు భిన్నంగా తన ఢిల్లీ టూర్ లో మాత్రం ఆయన ప్రతి చోట ముఖానికి మాస్కు పెట్టుకునే కనిపించారు.

కేంద్ర మంత్రులతో జరిగే భేటీల్లోనూ ముఖానికి మాస్కు తీయకుండా జాగ్రత్త పడ్డారు. కేంద్ర మంత్రులతో పాటు అమిత్ షాను కలిసిన సందర్భంలో మాత్రం ఫొటోలకు ఫోజులిచ్చే క్రమంలో ముఖానికి మాస్కు తొలగించారు. మిగిలిన సందర్భాల్లో మాత్రం ముఖానికి మాస్కు తప్పనిసరి అన్నట్లు ఉండడం ఆయనను రెగ్యూలర్ గా చూసే వారికి కొత్తగా కనిపించారు.

ఎందుకంటే మిగిలిన నేతలకు భిన్నంగా జగన్ ముఖానికి మాస్కు పెట్టుకోవటానికి అంత ఆసక్తి చూపించరన్న విషయం తెలిసిందే. ఇందుకు భిన్నంగా ఢిల్లీ టూర్ లో మాత్రం ఆయన ముఖానికి మాస్కు రావడంతో సరికొత్తగా కనిపించారని చెప్పక తప్పదు. మొత్తానికి జగన్ పర్యటన గతంలో కాకుండా ఈసారి కొత్త రకంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.