Vizag AP Capital : సంచలన ప్రకటన : ఏపీ రాజధానిగా విశాఖ.. షిఫ్ట్ అవుతున్న సీఎం జగన్

Vizag AP Capital : ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. అమరావతి నుంచి ఏపీ రాజధానిని విశాఖకు మారుస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. త్వరలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధాని గా మారబోతుందని.. నేను కూడా త్వరలో విశాఖపట్నం కు షిఫ్ట్ అవుతున్నాను అంటూ జగన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేసింది. వైసీపీ ప్రభుత్వం ‘మూడు రాజధానుల’పై వెనక్కి వెళ్లడం లేదని తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ […]

Written By: NARESH, Updated On : January 31, 2023 2:26 pm
Follow us on

Vizag AP Capital : ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. అమరావతి నుంచి ఏపీ రాజధానిని విశాఖకు మారుస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. త్వరలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధాని గా మారబోతుందని.. నేను కూడా త్వరలో విశాఖపట్నం కు షిఫ్ట్ అవుతున్నాను అంటూ జగన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేసింది.

వైసీపీ ప్రభుత్వం ‘మూడు రాజధానుల’పై వెనక్కి వెళ్లడం లేదని తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఈ మేరకు క్లారిటీతో ముందుకు వెళుతున్నట్టు ఈ ప్రకటనను బట్టి అర్థమవుతోంది. వచ్చే నెలలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముందు ఏపీ ప్రభుత్వం దేశ రాజధానిలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్‌కు పలువురు దౌత్యవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఫిక్కీ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) నుండి వ్యక్తులను ఆహ్వానించారు. వారిని ఉద్దేశించి సిఎం జగన్ ప్రసంగించారు. ఏపీలోని విశాఖకు పెట్టుబడులతో రావాలని.. రాబోయే రోజుల్లో మన రాజధానిగా మారబోతున్న విశాఖపట్నానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అంటూ ప్రకటించారు. రాబోయే నెలల్లో నేనూ విశాఖకు మారబోతున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు.

వైసీపీ ప్రభుత్వం ‘మూడు రాజధానులు’ తీసుకురావాలని భావిస్తోంది. వైజాగ్‌ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా పరిగణించింది. ఇప్పుడు జగన్ స్వయంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని విశాఖకు మార్చడంతో రాజధాని మార్పు తథ్యమని తేలిపోయింది. దీనిపై టీడీపీ సహా జనసేనలు భగ్గుమంటున్నాయి. అవి అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ వ్యాఖ్యలతో ఇప్పుడు ఏపీ రాజధాని ఏదన్న ఉత్కంఠకు తెరదించాయి.

ఈ సమ్మిట్ లోనే సీఎం జగన్ తన ప్రభుత్వ కృషిని, సహకారాన్ని లేవనెత్తారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మేము నంబర్ వన్ స్థానంలో ఉన్నాము. ఏపీలో తమ బేస్ లేదా ఫ్యాక్టరీని స్థాపించాలనుకునే ఏ సంస్థకైనా 21 రోజుల్లో అనుమతులు ఇవ్వబడతాయి. 974 కిలోమీటర్ల తీరప్రాంతం, ఆరు ఓడరేవులు, 11 పారిశ్రామిక కారిడార్లలో కేంద్రప్రభుత్వం యోచిస్తున్న మూడు కారిడార్లలో ఏపీలో మూడు కారిడార్లు అభివృద్ధి చెందుతున్నాయని సీఎం జగన్ తెలిపారు. కాబట్టి ‘మూడు రాజధానులు’ పథకం ఇంకా సజీవంగానే ఉంది, వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లకముందే వైసీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందని జగన్ ఘనంగా ప్రకటించారు.

దీంతో ఈ ఫిబ్రవరిలోనే అమరావతి నుంచి రాజధాని ఏపీకి మారడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ పాలనను కూడా విశాఖ నుంచే చేయబోతున్నారు. ఈ ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.