పీసీసీ చీఫ్‌ ఎవరైనా పాదయాత్ర చేసుడే..

ఎన్నో పోరాటాల మధ్య.. మరెన్నో బలిదానాల మధ్య చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ. కానీ.. ఆ క్రెడిట్‌ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కాపాడుకోలేకపోయారనేది రాజకీయ విమర్శకుల అభిప్రాయం. తెలంగాణ ఇచ్చింది తామేనన్న సెంటిమెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారనేది టాక్‌. అవును.. మరి ఎంతవరకూ గ్రూపుల కొట్లాటలతో కాలం వెల్లదీసిన కాంగ్రెస్‌ నేతలు.. తమ క్యాడర్‌‌ను కాపాడుకోవడం విఫలమయ్యారనేది కూడా వాస్తవం. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఏమాత్రం ప్రభావం చూపలేని […]

Written By: Srinivas, Updated On : December 20, 2020 1:02 pm
Follow us on


ఎన్నో పోరాటాల మధ్య.. మరెన్నో బలిదానాల మధ్య చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ. కానీ.. ఆ క్రెడిట్‌ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కాపాడుకోలేకపోయారనేది రాజకీయ విమర్శకుల అభిప్రాయం. తెలంగాణ ఇచ్చింది తామేనన్న సెంటిమెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారనేది టాక్‌. అవును.. మరి ఎంతవరకూ గ్రూపుల కొట్లాటలతో కాలం వెల్లదీసిన కాంగ్రెస్‌ నేతలు.. తమ క్యాడర్‌‌ను కాపాడుకోవడం విఫలమయ్యారనేది కూడా వాస్తవం. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఏమాత్రం ప్రభావం చూపలేని దుస్థితి. అందుకే.. పార్టీని రిపేర్‌‌ చేసేందుకు రెడీ అయ్యారు.

Also Read: రైతుకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది?

ఇందులో భాగంగా ముఖ్యంగా మరోసారి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టాలనుకుంటోంది. కొత్త సంవత్సరంలో మహా పాదయాత్ర చేపట్టే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర నేతలు. అధికారంలోకి రావడానికి పాదయాత్రనే నేతలు సెంటిమెంటుగా భావిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిగా అధిష్ఠానం ఎవరిని నియమించినా.. రానున్న మూడేళ్లూ రాష్ట్రాన్ని చుట్టి రానున్నట్లు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీన పడడానికి వరుస ఎన్నికల్లో ఓటమితోపాటు నేతలు ప్రజలతో మమేకం కాకపోవడమూ కారణమని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పార్టీ నేతలు పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని, వారికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం స్పష్టం చేసింది. దీంతో ప్రజల్లో అలాంటి నమ్మకాన్ని కలిగించడానికి, అధికారం వైపునకు అడుగులు వేయడానికి విస్తృతంగా పాదయాత్రలు చేపట్టాలన్న అభిప్రాయాలు పార్టీలో బలపడ్డాయి. వాస్తవానికి ప్రజల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడతానని ఎంపీ రేవంత్‌రెడ్డి ఇప్పటికే పార్టీ నుంచి అనుమతి కోరారు. జీహెచ్‌ఎంసీ సమస్యలపై తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పరిధిలో యాత్ర చేపట్టడానికి సన్నాహాలు కూడా చేసుకున్నారు. అయితే ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మాణిక్కం ఠాగూర్‌ నియామకం జరగడం, దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నేతలందరినీ అక్కడే తిష్ట వేయించడంతో రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

Also Read: జగన్ పై మెగా బ్రదర్ ప్రశంసలు.. బుక్కైన నాగబాబు

టీపీసీసీకి అధ్యక్ష రేసులో ప్రధానంగా ఉన్న రేవంత్‌రెడ్డి.. కొత్త ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన్నే నూతన సారథిగా నియమించిన పక్షంలో ఈ యాత్రల్లో కాంగ్రెస్‌ పార్టీ విధానం, పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తుంది అన్నది ఆయన ప్రజలకు వివరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. టీపీసీసీ రేసులో ఉన్న మరో నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పాదయాత్రనే నమ్ముకున్నారు. తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఆయన బాహాటంగానే ప్రకటించారు. ఇక టీపీసీసీ అధ్యక్ష పీఠం తనకు అప్పగించాలని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే మెడిసిన్‌ తన వద్ద ఉందంటూ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం రైతు సమస్యలపై తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. సంగారెడ్డి నుంచి ఆదిలాబాద్‌ వరకూ పాదయాత్ర చేపడతానని, ఈ యాత్రల్లో రైతులను కలిసి.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటానని, వాటిని శాసనసభలో లేవనెత్తుతానని అన్నారు. వీరితోపాటు పార్టీలోని మరికొందరు నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో పట్టు సాధించడానికి యాత్రలు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఈ పాదయాత్ర సెంటిమెంట్‌ మరోసారి కాంగ్రెస్‌ వర్కవుట్‌ అవుతుందో లేదో చూడాలి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్