సోనూసుద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?

బాలీవుడ్ నటుడు సోనూసుద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిత్రసీమలో టాప్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ తోపాటు సౌత్ ఇండస్ట్రీలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. టాప్ హీరోల పక్కన విలన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి మెప్పించాడు. అయితే అతనిలో కన్పించని మరో కోణం లాక్డౌన్లో బయటపడింది. Also Read: ఆర్ఆర్ఆర్ 2021లో అయినా సాధ్యమేనా? దేశంలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఎక్కడి చూసినా సోనూసుద్ పేరే విన్పిస్తుంది. ఆయన దాతృత్వాన్ని […]

Written By: Neelambaram, Updated On : July 29, 2020 11:22 am
Follow us on


బాలీవుడ్ నటుడు సోనూసుద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిత్రసీమలో టాప్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ తోపాటు సౌత్ ఇండస్ట్రీలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. టాప్ హీరోల పక్కన విలన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి మెప్పించాడు. అయితే అతనిలో కన్పించని మరో కోణం లాక్డౌన్లో బయటపడింది.

Also Read: ఆర్ఆర్ఆర్ 2021లో అయినా సాధ్యమేనా?

దేశంలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఎక్కడి చూసినా సోనూసుద్ పేరే విన్పిస్తుంది. ఆయన దాతృత్వాన్ని చూసి హీరోలు సైతం నోరుళ్లబెట్టాల్సిందే. సినిమాల్లో విలన్ గా నటించినంత మాత్రనా నిజజీవితంలోనూ అలాగే ఉంటారనుకోవడం పప్పులో కాలేసినట్లేనని సోనూసుద్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. లాక్డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన ఎంతోమందిని సొంత డబ్బులిచ్చి సొంతూళ్లకు పంపడంతో మొదలైన ఆయన దాతృత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

లాక్డౌన్లో వలస కార్మికుల కష్టాలను చూసి చలించిన సోనూసోద్ ఎంతోమంది వలస కార్మికులను సొంతూళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బస్సుల్లో, రైళ్లలో వారందరినీ సొంతూళ్లకు పంపించి వారిని ఆదుకున్నాడు. కష్టాల్లో ఉండి తన దృష్టికి వచ్చినవారికి సాయం అందిస్తూ సోనూసుద్ పెద్ద మనస్సును చాటుకున్నాడు. తాజాగా చిత్తూరు జిల్లాలోని ఓ రైతుకు ట్రాక్టర్ కొనిచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు.

దీంతో సోనూసుద్ ఆస్తి విలువ ఎంత ఉంటుందని ఒక బాలీవుడ్ మీడియా అధ్యయనం చేసింది. సోనూసుద్ ఆస్తుల విలువ దాదాపు రూ.130కోట్లు ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. దీంతో విలన్ పాత్రలు వేసే నటుడికి ఇంత డబ్బు ఎలా వచ్చిందనే ఆసక్తి నెలకొంది. అయితే సోనూసుద్ గత 20ఏళ్లుగా బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలో విలన్ గా నటిస్తూ బాగానే డబ్బు సంపాదించినట్లు సమాచారం. ఈ డబ్బును సోనూసుద్ రెస్టారెంట్లు, హోటళ్లలో పెట్టి లాభాలు గడించడంతో ఆ డబ్బు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

Also Read: పవన్‌ సరనన రకుల్‌.. నిజమేనా క్రిష్!

లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి సోనూసుద్ ఏకంగా 10కోట్ల రూపాయల వరకు సాయం చేసినట్లు ఆ మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో సోనూసుద్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఫేసు బుక్కుల్లో, సోషల్ మీడియాలో సోనూసుద్ దాతృత్వంపై పోస్టులు వైరల్ అవుతున్నాయి. సోనూసుద్ విలన్ కాదని.. రియల్ హీరో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సోనూసుద్ దాతృత్వానికి ప్రతీఒక్కరూ హ్యాట్సప్ చేస్తున్నారు.