Homeఆంధ్రప్రదేశ్‌PRC: నేడే పీఆర్సీపై తేల్చేయ‌నున్న జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఆశ‌లు ప‌దిల‌మేనా..?

PRC: నేడే పీఆర్సీపై తేల్చేయ‌నున్న జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఆశ‌లు ప‌దిల‌మేనా..?

PRC: ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. పీఆర్సీపైన సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల కీలక భేటీ జరగనుంది. పీఆర్సీ పైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన అధికారులు పలు మార్లు పీఆర్సీ పైన చర్చించగా నేటికి కొలిక్కి రాలేదు. పీఆర్సీ పైన నియమించిన అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక పైన ప్రధాన కార్యదర్శితో సహా అధికారుల కమిటీ అధ్యయన రిపోర్టు ముఖ్యమంత్రి జగన్‌ ముందు ఉంచారు.

PRC CM Jagan
CM Jagan

అయితే, పీఆర్సీపైన అధికారులు చేసిన సిఫార్సులను ఉద్యోగ సంఘాల నేతలు విభేదించారు. వీటిని తాము పరిగణలోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాలతో ఆర్దిక మంత్రి బుగ్గనతో సహా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ, సీఎస్ సమీర్ శర్మతో పాటుగా ఆర్దిక శాఖ అధికారులు పలు మార్లు సమావేశమయ్యారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. అయితే, పీఆర్సీ పైన కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే చర్చ జరగగా ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: టికెట్స్ ధరలు తగ్గింపు పై హీరోల స్పందన ఏది ?

ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్న టైంలో ప్రభుత్వం నుంచి వచ్చిన సూచన మేరకు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. తాజాగా సీఎంతో చర్చిస్తేనే దీనిపై పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయానికి వచ్చారు. ఈ నెల 9లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. లేనియెడల 9న ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేసారు. సీఎం జగన్ సీఎస్‌తో పాటుగా ఆర్దిక శాఖ అధికారులతో బుధవారం సమావేశమయ్యారు. 14.29 శాతంపై ఎంత శాతం పెంచితే ఖజానాపై భారం ఎంత అదనంగా పడుతుందనే విషయంపై సీఎం ఆర్థికశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించారు.

ప్రస్తుతం 27 శాతం ఐఆర్ అమలు చేస్తున్న పరిస్థితుల్లో అంత కంటే ఎక్కువగానే పీఆర్సీ ఫిట్ మెంట్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించటంతో జగన్ అంతకంటే ఎక్కువే ఇస్తారంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఫిట్ మెంట్ పై సీఎం జగన్ తన తుది నిర్ణయాన్ని నేడు లేదా రేపు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీనికోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ప‌వ‌న్ సినిమాల కోసం టికెట్ల రేట్లు త‌గ్గించ‌లేదు.. స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular