సిఎస్ పదవీకాలం పెంపునకు ఒకే అన్న జగన్..!

అధికారంలో ఉన్నావారెవరైనా తమకు అనుకూలంగా ఉన్న వారిని అధికారులు నియమించుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం సిఎస్ గా పని చేస్తున్న నీలం సాహ్నిని కావాలని కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో ఉండగా ఎల్.వి సుబ్రహ్మణ్యంను తప్పించి ఆయన స్థానంలో గత ఏడాది నవంబర్ లో ఏపీకి సీఎస్ గా తీసుకువచ్చారు. ఆమె పదవీ కాలం జూన్ తో ముగియనున్న నేపథ్యంలో ఆరు నెలలు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి నిర్ణయాలను సానుకూలంగా పని చేస్తుండటంతో […]

Written By: Neelambaram, Updated On : May 14, 2020 5:14 pm
Follow us on

అధికారంలో ఉన్నావారెవరైనా తమకు అనుకూలంగా ఉన్న వారిని అధికారులు నియమించుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం సిఎస్ గా పని చేస్తున్న నీలం సాహ్నిని కావాలని కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో ఉండగా ఎల్.వి సుబ్రహ్మణ్యంను తప్పించి ఆయన స్థానంలో గత ఏడాది నవంబర్ లో ఏపీకి సీఎస్ గా తీసుకువచ్చారు. ఆమె పదవీ కాలం జూన్ తో ముగియనున్న నేపథ్యంలో ఆరు నెలలు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి నిర్ణయాలను సానుకూలంగా పని చేస్తుండటంతో నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు ఆమె పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి జగన్ లేఖ రాశారు. దీనికి తోడు కరోనా ప్రభావం సీఎస్ కలిసి వచ్చిందనే చెప్పాలి.

మరోవైపు, కరోనా నేపథ్యంలో రిటైర్ కావాల్సిన అధికారుల పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. ఇదే విధంగా నీలం సాహ్ని పదవీకాలాన్ని కూడా పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అప్పటి సీఎస్ టాక్కర్ పదవీ కాలాన్ని రెండు పర్యాయాలు పొడిగించారు. గతంలో వైయస్ మరణించిన సమయంలో అప్పటి సీఎస్ రమాకాంత్ రెడ్డి పదవీకాలాన్ని కేంద్రం మూడు నెలలు పొడిగించింది. ఏపీ విభజన సందర్భంగా పీకే మహంతి పదవీకాలాన్ని నాలుగు నెలలు పొడిగించింది. దీంతో నీలం సాహ్ని ఏపీకి సి.ఎస్ గా మరో ఆరు నెలలు పని చేసే అవకాశాలు ఉన్నాయి.