
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వస్తే పెరుగన్నం తినొచ్చన్నారు..హాయిగా ఉండొచ్చొన్నారని, పంట నష్టపోతే కనీసం పరిహారం కూడా రావడం లేదని ద్వజమెత్తారు. ఎన్నికలు ఉంటేనే కేసీఆర్ కు రైతు బంధు గుర్తొస్తుందన్నారు. తను చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే.. కల్యాణ లక్ష్మి ఇస్తానని కేసీఆర్ అంటారేమోనని ఎద్దేవాచేశారు. మంత్రి హరీష్‌రావు ఉమ్మడి జిల్లా మెదక్ కు చేసిందేమీ లేదన్నారు. సంగారెడ్డిలో హరీష్‌రావు మీటింగ్ పెడితే హాజరై రైతుబంధుపై నిలదీస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు.