
గవర్నర్ కోటాలో ఇటీవల ఎమ్మెల్సీగా నియమితుడైన కడప జిల్లా ప్రొద్దుటూరువాసి ఆర్. రమేష్ యాదవ్ కు వరుసగా రెండు రోజులు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ప్రొద్దుటూరులో హత్యకు గురైన తెదేపా బీసీ నాయకుడు నందం సుబ్బయ్య మాదిరిగానే చంపుతామని తనను బెదిరించారని ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనను ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైకాపా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.