గ్యాస్ లీకేజీలో కొత్త పాయింట్ లేవనెత్తిన సీఎం జగన్

విశాఖలో జరిగిన ఎల్జీ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లీకేజీ ఘటన తర్వాత సీఎం విశాఖ బయలుదేరి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ లీకేజీ ఘటనలో ఆయన కొత్త పాయింట్ లేవనెత్తారు. ఎల్జీ పాలిమార్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ అయినపుడు అలారం ఎందుకు మోగలేదని అనుమానాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం […]

Written By: Neelambaram, Updated On : May 7, 2020 5:59 pm
Follow us on


విశాఖలో జరిగిన ఎల్జీ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లీకేజీ ఘటన తర్వాత సీఎం విశాఖ బయలుదేరి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ లీకేజీ ఘటనలో ఆయన కొత్త పాయింట్ లేవనెత్తారు. ఎల్జీ పాలిమార్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ అయినపుడు అలారం ఎందుకు మోగలేదని అనుమానాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం జగన్

మల్టి నేషనల్ కంపెనీ అయిన ఎల్జీలో గ్యాస్ లీకయినపుడు అలారం ఎందుకు మోగలేదనే ప్రశ్న తన మనసును కలవర పరుస్తుందని ఆయన అన్నారు. ఈ ఘటనపై లోతుగా అధ్యాయనం చేసేందుకు కమిటీ వేసినట్లు తెలిపారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత కంపెనీ చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఎల్జీ కంపెనీ నుంచి బాధితులకు నష్టపరిహారం రాబట్టడంతోపాటు బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు.

యాజమాన్యం నిర్లక్ష్యంతోనే గ్యాస్ లీక్: బీజేపీ

ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధలా ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయాల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బాధితులకు చికిత్స కోసం అయ్యే ప్రతీ ఖర్చు ప్రభుత్వమే భరిస్తాయని ఆయన స్పష్టం చేశారు. అయితే గ్యాస్ లీకేజీలో అలారం ఎందుకు మోగలేదని ప్రశ్నకు ఎల్జీ కంపెనీ ఎలాంటి సమాధానం ఇవ్వనుందో వేచి చూడాల్సిందే..!