వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ ఎలానో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి కూడా అలానే.. వీరి మధ్య విడదీయరాని బంధం ఉంటుంది. కానీ ఆపద వేళ.. ప్రొటోకాల్ వేళ మాత్రం తాను రూల్స్ మాత్రమే పాటిస్తానని.. ఈ విషయంలో ప్రాణ మిత్రుడు విజయసాయిరెడ్డి కూడా అందుకు అతీతుడు కాదని ఏపీ సీఎం జగన్ నిరూపించారు. తాజాగా బయటపడ్డ ఒక వీడియో వైరల్ అయ్యింది. జగన్ ఎంత నిక్కచ్చగా ఉంటాడో తేటతెల్లమైంది..
మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా!
*జైలు జీవితం నుంచి అధికారం వరకూ కలిసే..
జగన్ ఆర్థిక సామ్రాజాన్ని నిలిపిన వ్యక్తిగా విజయసాయిరెడ్డికి పేరుంది. ఓ ఆర్థిక నిపుణుడు అయిన విజయసాయిరెడ్డి మొదట జగన్ సాక్షి మీడియా సంస్థలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన వ్యాపార వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. వాటిపై నమోదైన కేసుల్లో జగన్ పాటు జైలుకు వెళ్లాడు. నమ్మిన బంటుగా విజయసాయిరెడ్డి జగన్ వెంట ఆది నుంచి నడిచాడు.
*అధికారంలోకి వచ్చాక జగన్ స్టిక్ట్
అయితే ఎంత దగ్గరి మనిషి అయినా కూడా అధికారంలోకి వచ్చాక జగన్ మాత్రం స్టిక్ట్ గానే ఉంటున్నారు. అధికారంలో ఎవరిని తలదూర్చనివ్వడం లేదన్న ప్రచారం ఉంది. ప్రతిపక్షంలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే రోజాను సైతం పక్కనపెట్టారు. ఆమెకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పెద్ద దుమారమే రేపింది. ఇక విజయసాయిరెడ్డిని సైతం ఢిల్లీ రాజకీయాలకు పరిమితం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న కూడా జగన్ నిర్ణయమే ఇక్కడ కీలకంగా ఉంది. ప్రజాపాలన, సంక్షేమం, బడుగు బలహీన వర్గాలకు న్యాయం విషయంలో జగన్ నిక్కచ్చగా వెళుతున్నారు. అందుకే ఆయనపై ఎవరి ప్రభావం లేదంటారు.
కొంపలు మునిగిపోతున్నా.. రాజధానిపై రాజకీయాలు!
*విజయసాయిరెడ్డిని పక్కనపెట్టిన జగన్
తాజాగా విశాఖలో గ్యాస్ లీక్ అయ్యింది. సీఎం జగన్ దీనిపై వేగంగా స్పందించారు. హుటాహుటిన తాడేపల్లి నుంచి బయలుదేరారు. ఆయనతోపాటు విజయసాయిరెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కూడా వెంట కారువద్దకు వచ్చారు. అయితే విజయసాయిరెడ్డి జగన్ వెనుకాల సీట్లో ఆల్ రెడీ కూర్చున్నారు. నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్లండి అని ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని అన్నారు. విమానంలో ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలుండడంతో జగన్ ఇక్కడ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం.. ఏదైనా విశాఖలో ప్రకటన చేయాలన్నా.. ఇన్ ఫర్ మేషన్ పొందాలన్న ఆరోగ్య మంత్రి అవసరం. అందుకే విజయసాయిరెడ్డిని కారు దించి మరీ ఆళ్ల నానిని వెంటబెట్టుకొని విశాఖకు విమానంలో వెళ్లిపోయారు.
*ఎంత సన్నిహితుడైనా ప్రొటోకాల్ తప్పని జగన్
ఏపీ సీఎం జగన్ తర్వాత నంబర్ 2 విజయసాయిరెడ్డినే. పార్టీలో, ప్రభుత్వంలో ఆయనే కీలకంగా ఉన్నారు. అలాంటి విజయసాయిరెడ్డిని ప్రొటో కాల్ ప్రకారం కారు దించి ఆళ్ల నానిని ఎక్కించుకొని తాను పాలన, అధికారం విషయంలో చాలా స్టిక్ట్ అని జగన్ నిరూపించారు. తన పాలనలో భవ బంధాలు.. పక్షపాతానికి తావులేదని జగన్ నిరూపించారు. ఇప్పుడు జగన్ చేసిన ఈ పనికి ప్రశంసలు కురుస్తున్నాయి..