ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎన్నో కష్టాలు అనుభవించారు. తన తండ్రి మరణం తరువాత జైలుకు కూడా వెళ్లారు. తరువాత సొంతపార్టీతో ప్రజల్లోకి వెళ్లారు. భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయినప్పటికీ.. టీడీపీ నేతలు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని తనను ఇంకా ఇబ్బందుల పాలు చేయడం జగన్ సహించలేక పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు సంయమనం పాటించాలని జగన్ పార్టీ నేతలకు ఆదేశాలు ఇస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగూ వైసీపీ మద్దతుదారులే విజయం సాధిస్తున్నారు. అధికారంలో ఉండడంతో సహజంగా ప్రజలు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు.
Also Read: విశాఖ ఉక్కుపై అమిత్ షాతో పవన్ మంత్రాంగం.. మొర వింటారా?
ఇక నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామాలు మరికొంతకాలం కొనసాగుతాయని.. వాటిని చూసీ చూడనట్లు వదిలివేయాలని సీఎం జగన్ సీనియర్ నేతలకు సూచించినట్లు తెలిసింది. మనం రెచ్చిపోయే కొద్ది వారికి అనవసర పబ్లిసిటీ తప్ప.. మరో ప్రయోజనం తమకు లేదని కూడా జగన్ వివరించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మహా అంటే.. మరో రెండు నెలలు కొనసాగుతుంది.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే.. మళ్లీ తెలుగుదేశం పార్టీ నేతలను జగన్ టార్గెట్ చేయనున్నారు. ఇప్పటికే కొందరు భూ వివాదాల్లోనూ,వ్యాపార లొసుగుల్లోనూ ఉన్నారు. వారందరికీ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే చుక్కలు చూపించాలన్నది జగన్ భావనగా ఉంది. ఇప్పటికే గొట్టిపాటి రవికుమార్ వంటి టీడీపీ నేతల వ్యాపారాలపై వరుస దాడులు నిర్వహించారు. మరికొందరు వ్యాపారాలు నిలిపివేసుకున్నారు.
Also Read: వైఎస్ షర్మిల పర్సనల్ జీవితం తెలుసా?
ఇలా కాకుండా విశాఖ సిట్ రిపోర్టు అందిన వెంటనే చర్యలు తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో టీడీపీ ముఖ్యనేతల పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. సిట్ నివేదిక మరో మూడు నెలల్లో ప్రభుత్వానికి అందుతుంది. అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. నిమ్మగడ్డ తలనొప్పి పోతుంది. విశాఖ భూ కుంభకోణంలో టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతను జగన్ టార్గెట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల తరువాత టీడీపీ నేతలకు జగన్ చుక్కలు చూపించడం ఖాయం అంటున్నారు…. వైసీపీ అభిమానులు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్