https://oktelugu.com/

40 ఏళ్ల అనుభవం.. అడ్డం తిరుగుతోందా..?

టీడీపీ అధినేత, సీనియర్ రాజకీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు.. ఎప్పుడూ అప్ డేట్ అవుతుంటారు. ఒంటిపైకి 70 ఏళ్ల వయసు వచ్చినా.. ఇప్పటికీ.. 29 ఏళ్ల కుర్రవాడిలా తన ఆలోచనలు తీసుకుంటారు. వయసు పెరిగినా.. మనసు మాత్రం ఇంకా యంగ్ అని చెబుతారు. కానీ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారుతున్నాయి. ఔట్ డేటెడ్ నిర్ణయాలు తీసుకుని పార్టీని ఇబ్బంది పెట్టడమే కాకుండా.. ప్రజల్లో చంద్రబాబు అపహాస్యం పాలవుతున్నారు. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 10, 2021 9:59 am
    Follow us on

    Chandrababu Naidu
    టీడీపీ అధినేత, సీనియర్ రాజకీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు.. ఎప్పుడూ అప్ డేట్ అవుతుంటారు. ఒంటిపైకి 70 ఏళ్ల వయసు వచ్చినా.. ఇప్పటికీ.. 29 ఏళ్ల కుర్రవాడిలా తన ఆలోచనలు తీసుకుంటారు. వయసు పెరిగినా.. మనసు మాత్రం ఇంకా యంగ్ అని చెబుతారు. కానీ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారుతున్నాయి. ఔట్ డేటెడ్ నిర్ణయాలు తీసుకుని పార్టీని ఇబ్బంది పెట్టడమే కాకుండా.. ప్రజల్లో చంద్రబాబు అపహాస్యం పాలవుతున్నారు.

    Also Read: విశాఖ ఉక్కుపై అమిత్ షాతో పవన్ మంత్రాంగం.. మొర వింటారా?

    పార్టీ నేతలకు ఇది అర్థం అవుతున్నా.. ఆయన అధినేత కాబట్టి చెప్పలేని పరిస్థితి. మరొకరకంగా చెప్పాలంటే.. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరు చెప్పప్పినా వినలేని పరిస్థితిలో ఉన్నారు. సమావేశానికి వచ్చిన తాను అనుకుంది చెప్పి వెళ్తారు. అంతకు మించి సీనియర్ నాయకుల సహాలు తీసుకోవడం కూడా చేయరు. ఈ అంశాన్ని ఎప్పుడో మర్చిపోయారని పార్టీ వర్గాలే బహిరంగంగా చర్చించుకుంటున్నాయి. ఇటీవల చంద్రబాబు నాయుడు స్వయంగా పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

    చంద్రబాబు నాయుడు పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి నవ్వుల పాలయ్యారు. పంచాయతీ ఎన్నికలకు ఎప్పుడూ ఎలాంటి మేనిఫెస్టోను ఏ పార్టీ విడుదల చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రస్టేషన్లో ఏదో ఒకటి చేయాలని, జగన్ ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఉత్సాహంతో మేనిఫెస్టోను విడుదల చేశారంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ విషయంలో ఎవరినీ సంప్రదించకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో పార్టీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది.

    Also Read: వైఎస్ షర్మిల పర్సనల్ జీవితం తెలుసా?

    ఇక తిరుపతి ఉప ఉన్నికల్లోనూ.. అభ్యర్థి విషయాన్ని ముందుగానే ప్రకటించి చంద్రబాబు నాయుడు తప్పు చేశారంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పనబాక లక్మ్షిని మూడు నెలల ముందు ప్రకటించి ఏం సాధించారని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె ప్రచారానికే శ్రీకారం చుట్టలేదని, ముందుగా ప్రకటించి చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులకు భయం అనేది లేకుండా చేశారని అంటున్నారు.మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడమే కాకుండా.. పార్టీకి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతున్నాయని పలువురు అంటున్నారు. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజల్లో చులకన కావడానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్న వాదనలు విస్తరిస్తున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్