https://oktelugu.com/

తన బలహీనతల పై శ్రీముఖి స్పందన !

ప్రతి మనిషికి కొన్ని బలహీనతలుంటాయి. ఆ బలహీనతలు వల్ల ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది, జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి ఉంటుంది. యాంకర్ కమ్ నటి శ్రీముఖి కూడా తన బలహీనత వల్ల చాలా కష్టాలు పడుతుందట. ఇంతకీ శ్రీముఖికి ఉన్న బలహీనత ఏమిటంటే.. ఆమెకు టూర్స్ కి వెళ్లడం అన్నా, అలాగే క్యాసినోలన్నా వీక్ నెస్ అట. తన బలహీనతల గురించి ఈ బబ్లీ బ్యూటీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. Also Read: స్టార్ […]

Written By:
  • admin
  • , Updated On : February 10, 2021 / 10:18 AM IST
    Follow us on


    ప్రతి మనిషికి కొన్ని బలహీనతలుంటాయి. ఆ బలహీనతలు వల్ల ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది, జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి ఉంటుంది. యాంకర్ కమ్ నటి శ్రీముఖి కూడా తన బలహీనత వల్ల చాలా కష్టాలు పడుతుందట. ఇంతకీ శ్రీముఖికి ఉన్న బలహీనత ఏమిటంటే.. ఆమెకు టూర్స్ కి వెళ్లడం అన్నా, అలాగే క్యాసినోలన్నా వీక్ నెస్ అట. తన బలహీనతల గురించి ఈ బబ్లీ బ్యూటీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

    Also Read: స్టార్ హీరోయిన్ కు అరుదైన వ్యాధి

    శ్రీముఖి మాటల్లో “నాకు టూర్స్ అంటే విపరీతమైన ఇష్టం. ముఖ్యంగా స్నేహితులతో కలిసి టూర్స్ కి వెళ్తుంటాను. దాంతో టైంతో పాటు డబ్బులు కూడా తనకు వృధా అవుతున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే నాకు క్యాసినోలంటే చాలా ఇష్టమని, ఎప్పటికప్పుడు క్యాసినోలకు వెళ్తుంటాను. ఫస్ట్ టైమ్ ఆడినప్పుడు వేరే వాళ్ల డబ్బుతో ఆడి గెలిచాను. రెండోసారి నా డబ్బులే పెట్టాను. కొంచెం లాభాలొచ్చాయి. మూడోసారి మొత్తం పెట్టేశాను. మొత్తం ఊడ్చుకుపోయింది.

    Also Read: లీకుల బాధలో మహేష్ సర్కారు.. !

    ఇక అప్పటి నుండి క్యాసినోల్లో ఆడకూడదని నిర్ణయించుకుంటూనే ఉన్నా, మళ్ళీ తన బలహీనత వల్ల క్యాసినోల్లో ఆడుతున్నానని చెప్పుకొచ్చింది. అయితే అంత జరిగినా ఇప్పటికీ క్యాసినోలకు వెళ్తానంటోంది శ్రీముఖి. ఎక్కువగా బెట్ చేయనని, లిమిటెడ్ గా పెడతానని చెబుతోంది. ఇక తన ముద్దుపేర్లు గురించి చెబుతూ.. అంతా తనను రాములమ్మ అని పిలిస్తే హ్యాపీగా ఉంటుందని.. కానీ ఇంట్లో మమ్మీ-డాడీ పాప అని పిలుస్తారని, ఇండస్ట్రీలోని వారు మాత్రం తనను రాములమ్మ అని పిలుస్తున్నారని.. తనను బుల్లితెర రాములమ్మ అని పిలిస్తే చాలా గర్వంగా ఉంటుందని శ్రీముఖి తెగ ఆనందపడిపోయింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్