CM Jagan: వైసీపీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. నోటి వెంట బూతులు పేలుతున్నాయి. మంత్రుల నుంచి కింది స్థాయి నేతల వరకూ జుగుప్సాకరమైన మాటలు వస్తున్నాయి. వారి హవాభావలతో వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. ఒక మంత్రి అయితే తన బొచ్చు అంటారు… మరోకరు లం…కొడకా అంటారు. ఏది పడితే అది.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు. చిన్నా పెద్దా తారతమ్యం లేదు. మహిళలన్న గౌరవం లేదు. వాస్తవానికి అధికార పార్టీ నాయకుల్లో కొందరు సీనియర్లకే ఈ మాటలు రుచించడం లేదు. ఇక ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో ముఖ్యమంత్రులు, విపక్ష నాయకులను చూసిన నేతలైతే జరుగుతున్న పరిణామాలు చూసి సిగ్గుపడుతున్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన వారు ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ తెగ బాధపడుతున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విపక్షాలపై దూకుడు కనబరుస్తారని సీఎం జగన్ కొందర్ని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తొలి కేబినెట్ లో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారిని డైనమిక్ యంగ్ లీడర్లుగా భావించి కేబినెట్ లో స్థానమిచ్చారు.

వ్యక్తిగత హననం…
అధినేత ఇచ్చే టాస్కు కనుక వీరలెవల్ లో వీరు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. ఇలా ఒకరేమిటి వారిని వీరిని అని చూడకుండా తెగ ఏకి పారేసేవారు. కొడాలి నాని అయితే చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ వాడే బాష భరించరానిదిగా ఉండేది. ఏడు పదుల వయసు ఉండే చంద్రబాబును.. వాడు అని సంబోధించడమే కాకుండా నా బొచ్చు పీకుతాడు, లోకేష్ ఒక పప్పు, తుప్పు అంటూ వ్యాఖ్యానించే తీరు అభ్యంతరకరంగా ఉండేది. దాదాపు మూడేళ్ల పాటు మంత్రి హోదాలో విపక్ష నేతల తీరుపై కొడాలి నాని ఏనాడూ గౌరవంగా మాట్లాడిన పాపాన పోలేదు. అక్కడ మహిళా పాత్రికేయులు ఉన్నా.. శాసనసభలో గౌరవ మహిళా శాసనసభ్యురాళ్లు ఉన్నా నాని తీరు మాత్రం అలాగే ఉండేది. సాధారణంగా విపక్ష నేతలు పడరు కనుక, విక్రుత మనస్థత్వం ఉన్న వారు తెగ ఆనందపడిపోయారు. కానీ ఎన్నిరోజులని ఆ తిట్ల దండకం వింటారు.
Also Read: KCR Tamilsai: ఎన్నాళ్లకెన్నాళ్లకూ.. ‘పగోళ్ల’తో ఈ పకపక నవ్వులూ..!
అందుకే చాలామంది స్వపక్ష నాయకులకు కూడా నాని మాటలు రుచించలేదు. మరీ నెల్లూరి అనిల్ కుమార్ యాదవ్ అయితే రంకెలు వేసి మాట్లాడేవారు. శాఖపరంగా ప్రగతి కంటే బూతుల ప్రగతే అధికంగా ఉండేది. తన వ్యక్తిగత హవాభావాలతో తెగ రెచ్చిపోయారు. పేర్ని నాని, ధర్మాన క్రిష్ణదాస్, వెల్లంపల్లి శ్రీనివాసరావు వంటి వారు కూడా బూతుల స్థాయిలో కాకపోయిన.. అంతలా అర్ధం వచ్చేలా మాట్లాడేవారు. కానీ ప్రారంభంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆహ్వానించిన వైసీపీ శ్రేణులకు ఎందుకో పునరాలోచనలో పెట్టాయి. దీంతో వారి నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ అధినేత మాత్రం కంట్రోల్ చేయకపోవడంతో బూతుల పరంపర కొనసాగింది.
వారిలాగే వీరు..
అయితే తొలి కేబినెట్ లో బూతుల మంత్రులుగా ఉన్న వారు పదవులు కోల్పోయారు. పోనీ విస్తరణలో అయినా ఆలోచన పరులు, సంస్కారవంతులు వచ్చారంటే మళ్లీ సేమ్ సీన్ రిపీట్. అంబటి రాంబాబు, ఆర్కే రోజా, గుడివాడ అమర్ నాథ్ వంటి వారికి మంత్రి పదవులిచ్చి సీఎం జగన్ ప్రోత్సహించారు. వీరు కూడా నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తున్నారు. అటు శాఖలపరమైన అనుమానాలను నివ్రుత్తి చేయలేరు కానీ.. విపక్ష నేతలపై నోరు పారేసుకోవడంలో ముందుంటున్నారు. అయితే తిట్ల విషయంలో తొలి నాళ్లలో తత్తరపాటుకు గురైనా ఇటీవల మాత్రం స్వరం పెంచారు. ఎంతలా అంటే.. ఇటీవల తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు.చంద్రబాబు అలుపెరగని శ్రామికుడు. ఇప్పటికీ యువకుడిగానే శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై కౌంటర్ ఇచ్చే క్రమంలో విశాఖకు చెందిన మంత్రి గుడివాడ అమర్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదీ కూడా మహిళలు హాజరైన బహిరంగ సభలోనే. చంద్రబాబు యువకుడు అన్న సంగతి అనితకు ఎలా తెలుసునని ప్రశ్నించడం ద్వారా ఒక జుగుప్సాకరమైన ఆలోచనకు తెరలేపారు. పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలను ప్రస్తావించవచ్చు. పాలనా వైఫల్యాలు, ప్రతిపక్ష పాత్రపై ఆరోపణలు చేయవచ్చు కానీ.. వ్యక్తిగత హననం కలిగించే మాటలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

అధినేత అంతే..
అధికార పార్టీ నేతలను నియంత్రించాల్సిన అధినేత జగన్ కూడా ఓ రకమైన ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను చేసిన పనులకు అడ్డు తగలుగుతున్నారనో.. లేకుంటే రాజకీయంగా డ్యామేజ్ చేస్తున్నారనో.. విపక్ష నాయకులు, మీడియాపై ఘాటైన, అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్నారు. తన వెంట్రుక కూడా పీకలేరని తలపై చేయి వేసి చెబుతున్నారు. మంత్రివర్గ సమావేశమో.. లేకుంటే వారి పార్టీ మీటింగ్ వరకైతే పర్వాలేదు. కానీ విద్యకు సంబంధించి సంక్షేమ పథకాల ప్రారంభించే సమయంలో, వేలాది మంది విద్యార్థులు హాజరైన సభల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలతో విద్యార్థులకు ఏం సందేశమిస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్ సీఎం ఇటువంటి ప్రకటన చేస్తే.. అవేశం వచ్చే సమయాల్లో విద్యార్థులు దీనిని అనుకరిస్తారని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వైసీపీని హింసావాద సంస్థగా అపవాదు ఉంది. ఇటీవల థర్టీ ఈయర్స్ ప్రుధ్విరాజ్ అక్కడ హింసవాదంపై శిక్షణిస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దానిని నిజం చేసేలా సీఎం, మంత్రులు, వైసీపీ నేతల మాటలున్నాయి. నియంత్రించకపోతే అధికార పార్టీ చులకన కావడం ఖాయం..
Also Read:CM KCR Visits Raj Bhavan: కేసీఆర్ కాంప్రమైజ్.. రాజ్‌భన్‌కు వచ్చిన సీఎం.. తమిళిసైతో మాటామంతి!