అన్ని కష్టాలూ జగన్‌కే.. ఎందుకో ఈ పరిస్థితి..!

అధికారంలోకి రావడానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ స్థాయిలో కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. ఒకవిధంగా చెప్పాలంటే తన తండ్రి వైఎస్సార్‌‌ బతికి ఉన్నప్పుడు జగన్‌ లైఫ్‌ వేరు. ఆయన చనిపోయాక ఎదుర్కొంటున్న సమస్యలు వేరు. వైఎస్సార్‌‌ మరణానంతరం కాంగ్రెస్‌ ఆయనను ఎన్ని విధంగా తిప్పలు పెట్టాలో అన్ని విధాలా పెట్టింది. అంతేకాదు.. ఏడాదిన్నరపాటు జైల్లో పెట్టించింది. అయినా.. ఆ లీడర్‌‌ వెనుకడుగు వేయలేదు. కాంగ్రెస్‌ పార్టీని వీడి తానే స్వయంగా పార్టీని పెట్టారు. పార్టీని పెట్టిన […]

Written By: Srinivas, Updated On : January 18, 2021 1:00 pm
Follow us on


అధికారంలోకి రావడానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ స్థాయిలో కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. ఒకవిధంగా చెప్పాలంటే తన తండ్రి వైఎస్సార్‌‌ బతికి ఉన్నప్పుడు జగన్‌ లైఫ్‌ వేరు. ఆయన చనిపోయాక ఎదుర్కొంటున్న సమస్యలు వేరు. వైఎస్సార్‌‌ మరణానంతరం కాంగ్రెస్‌ ఆయనను ఎన్ని విధంగా తిప్పలు పెట్టాలో అన్ని విధాలా పెట్టింది. అంతేకాదు.. ఏడాదిన్నరపాటు జైల్లో పెట్టించింది. అయినా.. ఆ లీడర్‌‌ వెనుకడుగు వేయలేదు. కాంగ్రెస్‌ పార్టీని వీడి తానే స్వయంగా పార్టీని పెట్టారు.

పార్టీని పెట్టిన నిత్యం ప్రజల్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఆయనకు పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు. అయినా.. తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. నిత్యం ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడారు. అధికారంలో ఉన్న టీడీపీ ఎన్ని విధాలా ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడ్డారు. చివరకు తండ్రి వారసత్వంతో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ప్రజలకు సంబంధించిన ప్రధాన సమస్యలను తెలుసుకున్నారు. చివరి వరకూ తోడుంటానంటూ మాటిచ్చారు.

Also Read: జగన్ ఆయువు పట్టుపై కొడుతున్న సోము వీర్రాజు

జగన్‌ మాటలను నమ్మిన ప్రజలు గత ఎన్నికల్లో ఆయనకు అధికారం కట్టబెట్టారు. అయితే.. జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో ఒక రకంగా ఆయనకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తనకు ఏదీ కలసి రావడం లేదని చెప్పడంలో తప్పేమీ లేదు. తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదు. ఇలా జగన్ పాలనలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఏ ముఖ్యమంత్రికి ఎదురుకాని అనుభవాలు జగన్‌ ఎదుర్కొంటున్నారు. ఇటు న్యాయస్థానాలు.. మరోవైపు ఎన్నికల కమిషన్‌ల నుంచి జగన్ తీసుకున్న ప్రతీ నిర్ణయానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి.

ప్రధానంగా జగన్‌ రాజ్యాంగ సంస్థలతోనే పోరాడాల్సి వస్తోంది. కొలువు దీరిన నాటి నుంచి ఆయనకు ఈ పోరాటం తప్పడం లేదు. ఒకవైపు విపక్షాల విమర్శలను, మరోవైపు రాజ్యాంగ వ్యవస్థల నుంచి కూడా ఫైట్ చేయాల్సిన పరిస్థితి.గతంలో చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. కానీ.. జగన్‌ అధికారంలోకి వచ్చాక పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు పెట్టాలని నిర్ణయించారు. జనం ఇచ్చిన 151 సీట్ల బలంతో జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. అది ఏడాదిన్నర కావస్తున్నా మూడు రాజధానులు అమలు కావడం లేదు. న్యాయస్థానాల్లోనే ఈ అంశం ఇంకా నలుగుతోంది. ఎప్పుడు తేలుతుందో ఎవరికీ తెలియదు.

Also Read: మోడీ వ్యాక్సిన్.. డప్పు కొట్టుకుంటున్న జగన్

మరోవైపు.. అటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌తోనూ వైరం తప్పడం లేదు. గత పది నెలలుగా జగన్‌ ప్రభుత్వానికి ఆయనకు పడడం లేదు. ఆయన టీడీపీకి వత్తాసుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. తమకు తెలియకుండా ఎన్నికలను ఏకపక్షంగా అప్పట్లో వాయిదా వేశారని, ఇప్పుడు అదే తరహాలో షెడ్యూల్‌ను విడుదల చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సిన ప్రభుత్వం వద్దని చెబుతున్నా ఎన్నికల కమిషనర్ మాత్రం షెడ్యూల్‌ను విడుదల చేశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

దీనిపైనా మరోసారి వైసీపీ సర్కార్‌‌ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. చివరికి హైకోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్‌ నడుస్తుండగా.. ఎన్నికల వద్దంటూ సూటిగా చెప్పేసింది. అయితే.. ఒక ముఖ్యమంత్రిగా, అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేతగా తాను తీసుకుంటున్న నిర్ణయాలు అమలు కాకపోవడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీసుకుంటున్న నిర్ణయాల్లో లోపాలు ఉండటంతోనే న్యాయసమీక్షల్లో విఫలమవుతున్నామా..? అన్నది కూడా జగన్ పరిశీలించుకోవాల్సి ఉంది. విపక్షం ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసేందుకే ప్రయత్నిస్తుంది. పైగా అక్కడ ఉన్నది చంద్రబాబు. 40 ఇయర్స్‌ ఇండ్రస్ట్రీ. ఆయనకు అన్ని రకాల పరిచయాలు, అనుబంధాలు ఉన్నాయని మర్చిపోవడమే జగన్ ఈ వైఫల్యానికి కారణమని చెప్పక తప్పదు. ఏది ఏమైనా వీటన్నింటి నుంచి జగన్‌ త్వరగా బయటపడుతాడని వైసీపీ నేతలు మాత్రం ఆశిస్తున్నారు.