తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్ని గ్రూపులు ఉన్నాయో ప్రతిఒక్కరికీ తెలిసిందే. ఈ గ్రూపుల గోళ వల్లే ఆ పార్టీకి భవిష్యత్ లేకుండా పోతోందని ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా. పీసీసీ చీఫ్ ఎన్నికల సందర్భంలోనూ ఇది మరోసారి రుజువైంది. ఇక్కడ నడుస్తున్న వర్గాలు కాస్త హైకమాండ్‌కు తెలిశాయి. ఇప్పటికే ఆ ఫలితం అటు దుబ్బాక ఉప ఎన్నికలోనూ.. ఇటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ వెల్లడైంది. అయితే… మరోసారి ఈ ఫలితం రిపీట్ కావద్దని హైకమాండ్ భావిస్తోంది.
Also Read: కేసీఆర్ కుటుంబంలో కోల్డ్ వార్..? : కేటీఆర్ సీఎం వద్దంట
అందుకే.. నాగార్జున సాగర్ ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అందర్నీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ పై పెట్టింది. అయితే సాగర్‌లో జానారెడ్డి బరిలో దిగడం ఇప్పటికే ఖాయం కాగా.. ఆయన కోసం అందరు కలిసొస్తారా అనేది మీమాంస ఉంది. 2018 ఎన్నికల్లో కేవలం 4 శాతం ఓట్లు తగ్గడంతో జానారెడ్డి ఓడిపోయారు. టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చారు. వాస్తవానికి సాగర్‌లో పార్టీ బలం కంటే.. జానా బలగమే ఎక్కువ అని చెప్పాలి. అందుకే ఆయన గెలుపు అంచుల వరకూ వెళ్లారు. ఈ దఫా టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత తనకి కలిసొస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు.
Also Read: తెలంగాణలో బీజేపీ చేసిన తప్పు అదే.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అయితే.. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ సైతం పుంజుకుంటోంది. దాని గ్రాఫ్ కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. బీజేపీని నిలువరించాలంటే.. ఆ పార్టీ ప్రచార వ్యూహాన్ని సమర్థంగా ఎదుర్కోవాలి. అంటే.. కాంగ్రెస్ తరపున కూడా ప్రచారం జోరందుకోవాలి. అందుకు ముఖ్య నాయకులు రంగంలోకి దిగాలి. ఆపద్ధర్మ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, పీసీసీ పీఠం కోసం ఎదురుచూస్తున్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి జిల్లా కూడా అదే కావడంతో వారిద్దరూ కచ్చితంగా జానారెడ్డి కోసం తరలివస్తారని అంచనాలైతే ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఇక.. ఈ ఉప ఎన్నికను తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో జానాకు అందరి సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యవహారం కాస్త అటుఇటుగా ఉంది. పీసీసీ పదవి హోల్డ్‌లో పెట్టేసరికి రేవంత్ లీడ్ తీసుకుంటారా లేదా అనేది డౌట్. మరోవైపు.. జానారెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి ప్రియాంక, రాహుల్‌తో ప్రచారం చేయించుకోవాలని చూస్తున్నారు. మొత్తంగా సాగర్ సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. చివరికి ఏమవుతుందో చూద్దాం.