ఆ విషయంలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు కదా

ఏపీలో మొదటి నుంచి జనసేన–బీజేపీ మిత్రపక్షాలు. అయితే.. ఎన్నికల తర్వాత బీజేపీ జనసేన రెండు పార్టీలు కూడా కలిసిపోయాయి. అయితే రెండు పార్టీలు కలిసిముందుకు సాగుతున్నా ఎవరి ఇష్టానుసారం వారు మాట్లాడుతుండటంతో అసలు ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలేనా అనే అనుమానం రాక తప్పదు. ముఖ్యంగా తిరుపతి బై పోల్ .. త్వరలో జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జనసేన శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. Also Read: అన్ని కష్టాలూ జగన్‌కే.. ఎందుకో ఈ […]

Written By: Srinivas, Updated On : January 18, 2021 1:16 pm
Follow us on

ఏపీలో మొదటి నుంచి జనసేన–బీజేపీ మిత్రపక్షాలు. అయితే.. ఎన్నికల తర్వాత బీజేపీ జనసేన రెండు పార్టీలు కూడా కలిసిపోయాయి. అయితే రెండు పార్టీలు కలిసిముందుకు సాగుతున్నా ఎవరి ఇష్టానుసారం వారు మాట్లాడుతుండటంతో అసలు ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలేనా అనే అనుమానం రాక తప్పదు. ముఖ్యంగా తిరుపతి బై పోల్ .. త్వరలో జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జనసేన శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

Also Read: అన్ని కష్టాలూ జగన్‌కే.. ఎందుకో ఈ పరిస్థితి..!

గత కొన్నిరోజుల క్రితం తిరుపతి బరిలో నిలిచేది బీజేపీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు నిలవాలనే విషయమై ఓ కమిటీ తేలుస్తుందని.. అంతవరకూ ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమని ఇంతవరకూ జనసేన నాయకులు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న తిరుపతిలో జనసేన కీలక సమావేశం కూడా జరపనున్నట్టు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు.

Also Read: ఏపీ వేదికగా బీజేపీ రామరథయాత్ర

తాజాగా.. విశాఖ శివారు రుషికొండలో దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు జనసేనను అవమానపరిచేలానే ఉన్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవైపు తిరుపతిలో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉంటారని బీజేపీ నేతలు పైకి చెబుతున్నప్పటికీ లోపల మాత్రం అధికారికంగా తామే నిలుస్తున్న భావనతో ఏర్పాట్లను చురుగ్గా చేసుకుంటున్నారట.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

అయితే.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అభ్యర్థి గెలవాలని దీనికోసం పార్టీ శ్రేణులన్నీ అక్కడ పనిచేయాలని ఆ పార్టీ కోర్ కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి మండలానికి ఒక బృందాన్ని పంపాలని కీలక వ్యక్తులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు అంతా అక్కడే ఉండాలని నిర్ణయించడం గమనార్హం. కేవలం పార్టీ అభ్యర్థి ప్రకటన మాత్రమే మిగిలింది. తమను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా తిరుపతి ఉప ఎన్నికపై నిర్ణయాలన్నీ తీసుకుంటూ అవమానిస్తున్న బీజేపీ వైఖరిపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.