జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ నాయకుల పై ఫుల్ ఫోకస్ పెట్టింది . అవినీతి రహిత పాలనే తమ పార్టీ ధ్యేయం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మరియు అవకతవకలు వెలికి తీస్తాం అన్నారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని చెప్పడం జరిగింది. దీనిలో భాగం ఇటీవలే టీడీపీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు మరియు జె సి ప్రభాకర్ రెడ్డిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఐతే ఇది ఇంతటితో ఆగేది […]

Written By: Neelambaram, Updated On : June 22, 2020 12:41 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ నాయకుల పై ఫుల్ ఫోకస్ పెట్టింది . అవినీతి రహిత పాలనే తమ పార్టీ ధ్యేయం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మరియు అవకతవకలు వెలికి తీస్తాం అన్నారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని చెప్పడం జరిగింది. దీనిలో భాగం ఇటీవలే టీడీపీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు మరియు జె సి ప్రభాకర్ రెడ్డిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఐతే ఇది ఇంతటితో ఆగేది కాదన్నది టీడీపీ నేతలకు బాగా తెలుసు. దీనితో వారు అరెస్టుల విషయంలో జగన్ పై ఎదురుదాడికి దిగుతున్నా… లోలోపల భయపడుతున్నారు.

చిరు పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!

ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అని తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఈయన నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల కాంట్రాక్టుల కేటాయింపు, పట్టి సీమ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్ట్స్ లో భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుండే వైసీపీ నేతలు దేవినేని ఉమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇక వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక పోలవరం పనుల కాంట్రక్టుల విషయంలో సమూల మార్పులు చేశారు. జగన్ రివర్స్ టెండరింగ్ విధానం తీసుకురావడం జరిగింది.

ఏపీ ఈఎస్ఐ స్కామ్ కు తెలంగాణకు సంబంధం ఏంటీ?

మంత్రిగా ఆయన చేసిన కేటాయింపులు, ఒప్పందాలు వంటి కీలక అంశాలపై ఇప్పటికే సమాచారం సేకరించే పనిలో అధికారులు ఉన్నారన్న మాట వినబడుతుంది. కీలక ఆధారాలు దొరికిన నేపథ్యంలో దేవినేని ఉమను అరెస్ట్ చేయడం ఖాయం. టీడీపీ కీలకనేతల్లో ఒకరైన దేవినేని ఉమ అరెస్ట్ జరిగితే ఆ సెగ..టీడీపీ అధినేత చంద్రబాబు మరియు లోకేష్ లకు తగలడం ఖాయం. ఒకవేళ దేవినేని నిజంగా అవినీతికి పాల్పడితే దానివెనుక అధినేతల హస్తం ఉంటుంది కాబట్టి. ఈనేపథ్యంలో అరెస్ట్ ని తప్పించుకోవడానికి ఉమా తగు జాగ్రత్తలలో ఉన్నారని.. అన్ని రకాల న్యాయపరమైన లొసుగులు పరిశీలిస్తున్నారని సమాచారం. నిజంగా దేవినేని ఉమా అరెస్ట్ జరిగితే టీడీపీకి పెద్ద షాక్ అని చెప్పాలి.