ఆర్జీవీ పై ఫైర్ అయిన ప్రణయ్ భార్య అమృత

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫాదర్స్ డే సందర్భంగా ‘మర్డర్’ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. తెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ హత్య ఉదాంతం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. అమృత ప్రేమ ఉదాంతంలో ఆమె భర్త ప్రణయ్ హత్యకు గురికాగా తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నట్లు ట్వీటర్లో ప్రకటించాడు. ‘మర్డర్’ టైటిల్.. కుటుంబ కథాచిత్రమ్ అనే సబ్ టైటిల్ తో […]

Written By: Neelambaram, Updated On : June 22, 2020 12:43 pm
Follow us on


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫాదర్స్ డే సందర్భంగా ‘మర్డర్’ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. తెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ హత్య ఉదాంతం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. అమృత ప్రేమ ఉదాంతంలో ఆమె భర్త ప్రణయ్ హత్యకు గురికాగా తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నట్లు ట్వీటర్లో ప్రకటించాడు. ‘మర్డర్’ టైటిల్.. కుటుంబ కథాచిత్రమ్ అనే సబ్ టైటిల్ తో ఫాదర్స్ డే రోజున సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదలచేసి అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకున్నాడు.

రాజధాని తరలింపుపై ప్రభుత్వం వెనక్కి?

‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ భార్య అమృత తాజాగా స్పందించింది. రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సినిమాకు తన జీవితానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆదివారం వర్మ విడుదల చేసిన ‘మర్డర్’ పోస్టర్ చూశాక ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని వాపోయింది. తన కథ తన సన్నిహితులకు తప్ప మరేవరికీ తెలియదని తెలిపింది. ఓ కట్టుకథకు తమ పేర్లు వాడుకొని దర్శకుడు అమ్ముకోవాలని చూస్తున్నాడని చెప్పింది.

ప్రణయ్ హత్య జరిగినప్పటి నుంచి తాను ఎంతో భావోద్వేగానికి గురవుతున్నట్లు తెలిపింది. తమ కథ ఆధారంగా తెరక్కించే సినిమాకు తమ అనుమతి తీసుకోవాలని తెలియదా? అంటూ ప్రశ్నించింది. మహిళలను ఎలా గౌరవించాలో చెప్పే తల్లి లేనందుకు అతడిపై జాలిపడుతున్నానని అమృత వ్యాఖ్యానించింది. తన జీవితం మరోసారి తలకిందులైందని వాపోయింది. వర్మ తీసే మూవీకి తన కథకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. వర్మ ఓ ఫేక్ ఫిలిం మేకరని ఆయన కంటే తానే ఎక్కువ జీవితాన్ని చూశానని చెప్పింది. ఆర్జీవీపై కేసు వేసి అతడికి పబ్లిసిటీ కల్పించే ఉద్దేశం లేదని తెలిపింది.

ఏపీ ఈఎస్ఐ స్కామ్ కు తెలంగాణకు సంబంధం ఏంటీ?

ఈ నేపథ్యంలో ఆర్జీవీ ‘మర్డర్’ సినిమా విషయంలో అమృతను కలుస్తారా? లేదా అనేది ఆసక్తిని రేపుతోంది. ఆర్జీవీ కేవలం మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తారా? లేదా అమృత వెర్షన్ కూడా తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. అమృత అనుమతి లేకుండానే మూవీ తీస్తే ఆమె చెబుతున్నట్లు సినిమా ఓ కట్టుకథగా మిగిలే అవకాశం ఉంది. దీంతో ఆర్జీవీ ‘మర్డర్’ విషయంలో ఎలా ముందుకెళుతారనేది ఆసక్తిని రేపుతోంది.