జగన్ కొత్త నిర్ణయాలైన ఫలితాన్నిస్తాయా?

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక సరఫరా విషయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. టీడీపీ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం గత ఏడాది కొత్త విధానాన్ని వెంటనే అమలలోకి తీసుకురాకపోవడం వల్ల ప్రభుత్వం అబాసుపాలయ్యింది. పనులు దొరకక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనంతరం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో ఇసుక సామాన్యులకు అందుబాటులో లేదు. ఈ అంశంపై ప్రతి పక్ష పార్టీలు […]

Written By: Neelambaram, Updated On : June 6, 2020 5:26 pm
Follow us on


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక సరఫరా విషయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. టీడీపీ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం గత ఏడాది కొత్త విధానాన్ని వెంటనే అమలలోకి తీసుకురాకపోవడం వల్ల ప్రభుత్వం అబాసుపాలయ్యింది. పనులు దొరకక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనంతరం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో ఇసుక సామాన్యులకు అందుబాటులో లేదు. ఈ అంశంపై ప్రతి పక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. ఆందోళనలు చేపట్టాయి.

గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సైతం బుకింగ్ కు, సరఫరాకు మధ్య 2 లక్షల టన్నుల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తిచామని తెలిపారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతున్నారు. నాడు – నేడు కార్యక్రమం పనులకు ఇసుక దొరకడం లేదని, సామాన్యులకు సైతం గుప్పెడు ఇసుక ఇవ్వలేకపోతున్నామని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వాపోయారు. రేవులో బయలుదేరిన ఇసుక వాహనాలు వినుకొండ రాకుండా మధ్యలో ఎటువెళుతున్నాయనేది తెలియడం లేదన్నారు.

ఈ నేపథ్యంలో ఇసుక విధానాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామ‌, వార్డు స‌చివాలయాల ద్వారా ‌ఇసుక బుకింగ్ చేసుకునే అవ‌కాశం ప్ర‌జ‌ల‌కు క‌ల్పించాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బల్క్‌ ఆర్డర్లకు అనుమతుల వల్ల ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ అంశాన్ని జేసీకి అప్ప‌గించనుంది. పోర్టల్‌ నుంచి బల్క్‌ ఆర్డర్లను తొలగించనున్నారు. నియోజక వర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడడం, చిన్న చిన్న నదుల నుంచి పక్కనే ఆనుకుని ఉన్న గ్రామాలకు ఎడ్లబళ్ల ద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వడం వంటి చర్యలకు ప్రభుత్వం అనుమతించింది. తాజాగా సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంత ఫలితాన్ని ఇస్తాయనేది వేచిచూడాల్సిందే.