https://oktelugu.com/

చిరంజీవి బాటలో మహేష్ ఫ్యామిలీ..

మొన్న చిరంజీవి.. నేడు మహేష్ బాబు ఫ్యామిలీ.. ఇలా వరుసగా ఏపీ సీఎం జగన్ కు జై కొడుతున్నారు. టాలీవుడ్ ను ఆకర్షించడంలో ఏపీ సీఎం జగన్ ప్రయత్నాలు, కృషి ఫలిస్తున్నాయి. వైయస్ జగన్ తో సూపర్ స్టార్ ఫ్యామిలీ చేతులు కలిపింది. సీఎం జగన్ పాలనకు ఒక్కొక్కరుగా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఫిదా అయిపోతున్నారు. సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు.. పేదల కోసం కమిట్మెంట్ తో పనిచేస్తున్న తీరు చూసి సినీ ప్రముఖులంతా జగన్ […]

Written By: , Updated On : June 6, 2020 / 12:53 PM IST
Follow us on


మొన్న చిరంజీవి.. నేడు మహేష్ బాబు ఫ్యామిలీ.. ఇలా వరుసగా ఏపీ సీఎం జగన్ కు జై కొడుతున్నారు. టాలీవుడ్ ను ఆకర్షించడంలో ఏపీ సీఎం జగన్ ప్రయత్నాలు, కృషి ఫలిస్తున్నాయి. వైయస్ జగన్ తో సూపర్ స్టార్ ఫ్యామిలీ చేతులు కలిపింది. సీఎం జగన్ పాలనకు ఒక్కొక్కరుగా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఫిదా అయిపోతున్నారు. సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు.. పేదల కోసం కమిట్మెంట్ తో పనిచేస్తున్న తీరు చూసి సినీ ప్రముఖులంతా జగన్ బాట పడుతున్నారు.

ఒకప్పుడు ఇండస్ట్రీ అంటే టిడిపికి పేటెంట్ హక్కుగా ఉండేది. నాడు మహా నటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కావడం చాలా మంది హీరోలను ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు గా చేయడం వలన సినిమా ఫ్లేవర్ టిడిపిలోనే కనిపించేది. టీడీపీని చంద్రబాబు లాక్కున్నాక కూడా సినీ ఇండస్ట్రీకి పెద్దపీట వేశారు. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే గా ఉండడంతో సినిమా ఇండస్ట్రీ అంతా చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేవారు.చిరంజీవి కుటుంబంతో సహా మిగతా కుటుంబాలన్నీ టీడీపీకి సాహిత్యంగా ఉండేవి.

కానీ ఇప్పుడు ఆ వ్యవస్థను అంతా సీఎం జగన్ పూర్తిగా మార్చేసారు. టీడీపీకి సినిమా ఇండస్ట్రీ ని దూరం చేసే పనిలో పడ్డారు సీఎం జగన్. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ని ఇందుకోసం వాడేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ సినిమా వాళ్ళు ఏమి అడిగినా ఏపీ ప్రభుత్వంలో జగన్ పని చేయిస్తున్నారు. ఇన్నాళ్లు చంద్రబాబు సినిమా ఇండస్ట్రీని తన పార్టీ కోసం వాడుకున్నా… ఇండస్ట్రీకు పెద్దగా చేసిందేమీ లేదు. కానీ జగన్ అటు ఇండస్ట్రీకి పరిశ్రమ పరంగా.. ఇటు ప్రముఖులకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణలో సినీ ఇండస్ట్రీకి పెద్ద పీట వేస్తుండగా…. ఆంధ్ర సీఎం జగన్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులకు పెద్ద పీట వేస్తున్నారు. దీంతో టాలీవుడ్ పెద్దలు కూడా ఇప్పుడు తమ నిర్ణయాలు మార్చుకుంటున్నారు.

ఇన్నాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి సీఎం జగన్ కు ఇండస్ట్రీలో ఎమ్మెల్యే రోజా మాత్రమే మద్దతుగా ఉన్నారు. ఇండస్ట్రీలోని హీరో నాగార్జున కుటుంబంతో ఎప్పటినుంచో జగన్ కు సాహిత్యం ఉంది. నిర్మాత,.జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ కూడా జగన్ కు జైకొట్టి మద్దతు పలికారు. జగన్ సీఎం అయ్యాక మెగాస్టార్ చిరంజీవిని సైతం సీఎం జగన్ తన వైపు మళ్లేలా చేసుకున్నారు. చిరంజీవి సైరా సినిమా కి ప్రోత్సహించడంతో పాటు తెలుగు సినిమా షూటింగ్ లకు చిరంజీవి కోరగానే ఏపీలో ఉచితంగా అనుమతి ఇస్తూ జగన్ జీవో జారీ చేశారు. దీంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం సీఎం జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి సతీసమేతంగా సీఎం జగన్ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించారు. ప్రతి వేదిక పైన సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవి సీఎం జగన్ ను ప్రశంసిస్తున్నారు. జగన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ కు భిన్నమైన వైఖరి తీసుకొని చిరంజీవి మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నారంటూ జగన్ ను ప్రశంసిస్తున్నారు.. ఇప్పుడు ఆ కోవలోకి మహేష్ బాబు కుటుంబం కూడా చేరిపోయింది.

మహేష్ బాబు బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆ కుటుంబం షాక్ ఇచ్చింది. వాస్తవానికి మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ -విజయ నిర్మలలు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని అత్యంత అభిమానిస్తారు. ఎప్పుడూ వైయస్సార్ కి మద్దతుగా నిలిచారు. అయితే 2014 ఎన్నికల్లో మహేష్ బాబు ఫ్యామిలీ గల్లా జయదేవ్ కుటుంబం టిడిపిలో చేరారు. గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు టిడిపి ఎంపీగా ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు వరకు మహేష్ బాబు చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఎన్నికల సమయంలో టికెట్ రాలేదని తిరిగి టిడిపిలోకి చేరిపోయారు. దాంతో మహేష్ బాబు కుటుంబం అంతా టీడీపీకి మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏడాది తిరక్కముందే సీఎం జగన్ పనితీరుతో మహేష్ బాబు కుటుంబం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళింది.

గతంలో మహేష్ బాబు భార్య నమ్రత స్వయంగా వచ్చి వైఎస్ భారతి తో భేటీ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరు బుర్రిపాలెం గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మహేష్ బాబు భార్య కోరగానే వైయస్ భారతి అంగీకరించడం.. ఆ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లడం ఆ గ్రామానికి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో కూడా మహేష్ బాబు సీఎం జగన్ సహాయాన్ని కోరారు. అది కూడా జగన్ అంగీకరించడం బాగా కలెక్షన్స్ రావడంతో మహేష్ బాబు కుటుంబం కూడా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంచితనానికి ఫిదా అయింది.

సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు మహేష్ బాబు చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తిరిగి టీడీపీనీ వీడి మళ్లీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి చేరారు.. మళ్లీ పాత పద్ధతులు మాదిరిగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ఉంది అన్న విషయం స్పష్టమైపోయింది.