TDP Janasena Alliance- Jagan: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. ప్రతిపక్షాలు ఒక్కటి కాకుండా పథకం వేస్తున్నాయి. ఇందు కోసం వారిని రెచ్చగొట్టే విధంగా మాటల యుద్ధం చేస్తోంది. దీంతో వారు పొత్తుల విషయంో ఒక్కటిగా ఉండొద్దనే ఉద్దేశంతో జగన్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. పదేపదే చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ కు కోపం వచ్చి టీడీపీతో జత కట్టాలనే ఉద్దేశంతో జగన్ తన ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ తో తప్పటడుగు వేయించాలని ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ వచ్చే ఎన్నికల్లో నెగ్గేందుకు పటిష్ట ప్రణాళిక అమలు చేసే పనిలో పడింది. దీని కోసమే ప్రతిపక్షాలు ఏకం కాకుండా చూసే ప్రయత్నంలో ఉంది. ప్రతిపక్షాలన్ని ఒక్కటైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటే ప్రభుత్వానికి మింగుడు పడదు. విజయం అంత తేలిగ్గా లభించదు. అందుకే వాటిలో అనైక్యత సృష్టించి వెరికి వారే యమునా తీరే అన్న చందంగా చేస్తే ఓటు చీలిపోయి ప్రభుత్వానికి మేలు చేకూరుతుంది. దీని కోసమే వైసీపీ అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తోంది.
Also Read: BYJU’s in AP Govt Schools: జగన్ సర్కార్, బైజూస్.. కొత్త ఒప్పందం కథేంటి?
పవన్ కల్యాణ్ బీజేపీతో కలిస్తే వైసీపీకి నష్టం కలగనుందని అంచనా వేస్తోంది. అందుకే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే వైసీపీకి లాభం జరగనుందని అంచనా వేస్తోంది. దీని కోసం పవన్ కల్యాణ్ ను టీడీపీ వైపు మళ్లేందుకు ఆయనను విమర్శలకు గురి చేస్తోంది. దీని కోసమే బాబుకు దద్తపుత్రుడు అంటూ నిందలు వేస్తున్నారు. జగన్ ప్రణాళికలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి జగన్ పటిష్ట యంత్రాంగాన్ని నియమించినట్లు చెబుతున్నారు. ప్రతిపక్షాల ఏకీకరణ కాకుండా చూసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.
ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ జనసేన, కాంగ్రెస్ ఇంకో వైపు, వామపక్షాలు ఒంటరిగా బీజేపీ కూడా మరో మార్గంలో ప్రయాణిస్తే ఓట్లు చీలిపోయి వైసీపీకి గెలుపు సునాయాసం అవుతుంది. అందుకే జగన్ ముందస్తు వ్యూహంలో భాగంగానే పవన్ కల్యాణ్ టీడీపీ వైపు వెళ్లేందుకు వాటిని ప్రేరేపిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కు రాబోయే ఎన్నికలు విషమ పరీక్షగానే మారనున్నాయి. ఇందులో భాగంగానే ఆయన తన పార్టీ మరోమారు విజయం సాధింాలనే తపనతో ఇవన్నీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా టీడీపీతోనే జనసేన ఉండాలనే వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:KCR vs BJP: బీజేపీ రూట్ లోనే కేసీఆర్.. అదే సెంటిమెంట్ తో ఎదురుదాడి?