AP Politics: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా పార్టీల్లో మాత్రం ఆ వేడి ఇప్పుడే మొదలైంది. జనసేన ఆవిర్భావ సభ విజయవంతం కావడంతో పార్టీల్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఇక తమ పార్టీ భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే వైసీపీ కూడా రహస్యంగా తమ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది.

అందులో విస్తుపోయే నిజాలు వెల్లడి అయినట్లు పార్టీ వర్గాల్లో ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ కోసం వారు చేపడుతున్న పనులు తదితర విషయాలపై సర్వే నిర్వహించడంతో అందులో కొన్ని చేదు నిజాలు బహిర్గతమయ్యాయి. యాభై మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని రిపోర్టులు రావడం గమనార్హం. దీంతో వచ్చే ఎన్నికల్లో వారికి అవకాశం ఇవ్వకపోవచ్చనే వాదనలు వస్తున్నాయి. దీంతో వారెవరనే దానిపై సందిగ్తత చోటుచేసుకుంది.
Also Read: తన గెలుపు సీక్రెట్ ఏంటో చెప్పిన మోడీ!
ఎమ్మెల్యేలు తత్తరపాటుకు గురవుతూ సీఎంవో కార్యాలయం నుంచి లిస్టు తెప్పించుకుని చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ సీటు గల్లంతయితే ఎలా అనే తాపత్రయం అందరిలో కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై కూడా క్లారిటీ ఇవ్వడంతో ఎవరికి పదవులు దక్కుతాయో ఎవరి పదవి ఊడుతుందోననే టెన్షన్ మంత్రుల్లో పట్టుకుంది. మొత్తానికి ఏపీలో కొనసాగుతున్న పరిణామాలతో వైసీపీ నేతల్లో ఆందోళన నెలకొంది.
ఏపీలో జగన్ చేసిన సర్వేతో ఎమ్మెల్యేల్లో అప్పుడే వణుకు పుడుతోంది. తమ పదవులు ఎక్కడ జారిపోతాయోనని బెంగ పట్టుకుంది. దీంతో వారు ఏం చేయలేక డైలమాలో పడుతున్నారు. తమ భవితవ్యం ఏమిటని ఆలోచనలో పడిపోతున్నారు. ఆ లిస్టులో తమ పేరు ఉందో ఏమోనని దిగులు చెందుతున్నారు. జగన్ చేసిన సర్వేతో నాయకుల్లో గుబులు పుడుతోంది. భవిష్యత్ లో తమ దారి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో అందరికి సర్వే భయం పట్టుకోవడం విశేషం

సర్వేలో మొదట గెలిచిన 30 మంది, సీనియర్ ఎమ్మెల్యేలు 12, మహిళా ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ ఏ మేరకు నిర్ణయం తీసుకుని వారిని ఏం చేస్తారనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీలో కొందరు జంప్ జలానీలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. వైసీపీలో ఉంటూ ఇతర పార్టీల నేతలతో టచ్ లో ఉన్న వారిపై కూడా జగన్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఏపీలో సర్వే భయం అందరిని వెంటాడుతోందని తెలుస్తోంది.
Also Read: ఇంకో రెండు సార్లు జగన్‌ను సీఎం చేయాలట.. సుమన్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు..!