Gold, Silver Prices: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల గత కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,000 రూపాయల మార్కును అందుకోవచ్చని కామెంట్లు వ్యక్తమయ్యాయి. వైరల్ అయిన ఈ వార్తలు సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలను తెగ టెన్షన్ పెట్టాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ వస్తున్న తరుణంలో బంగారం, వెండి ధరలు అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం.
హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 540 రూపాయలు తగ్గింది. బంగారం ధరలు అంతకంతకూ తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 51,930 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఏకంగా 500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 47,600 రూపాయలుగా ఉండి. మరోవైపు వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుతుండటం గమనార్హం.
కిలో వెండి ధర ఏకంగా 1400 రూపాయలు తగ్గడం వెండి కొనుగోలుదారులకు శుభవార్త అని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం. బంగారం ధర ఔన్స్ కు 0.02 శాతం తగ్గగా అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర 1919 డాలర్లుగా ఉంది. దేశీయ మార్కెట్ లో వెండి ధర తగ్గినా అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం వెండి ధర పెరగడం గమనార్హం.
బంగారం, వెండి ధరలలో ప్రాంతాలను బట్టి స్వల్పంగా తేడాలు ఉంటాయి. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వాళ్లు వెంటనే కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. బంగారం, వెండి ధరలు అంతకంతకూ తగ్గడంతో కొనుగోళ్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.