CM Jagan: భయమన్నది నా బ్లెడ్ లో లేదు రా బ్లడీఫూల్..ఇటీవల పాపులర్ అయిన సినిమా డైలాగ్ ఇది. బహుశా సినిమా కాబట్టి రచయిత అలా రాసి ఉంటారు. కానీ భయం అనేది ఫీలింగ్. అది అందరిలోనూ ఉంటుంది. అన్ని జీవుల్లోనూ ఉంటుంది. అది సందర్భానుసారం వస్తుంది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ లోనూ కనిపిస్తోంది. అందరు కలిసి వచ్చినా నా ఈ.. కూడా పికలేరని..తాను భయపడడం లేదని పలు సందర్భాల్లో జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఆయన చర్యలు మాత్రం భయపడినట్టే కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తప్పదన్న అభద్రతా భావానికి ఆయన గురవుతున్నట్టు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. లోలోపల అంత భయం పెట్టుకొని.. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టు జగన్ చర్యలు ద్వారా ఇట్టే తెలుస్తోంది. అందుకే ప్రజలపై కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అదేదో పాలనపై ఫోకస్ పెంచితే సరిపోయి ఉండేదని.. కానీ లేనిపోని ప్రయోగాలు వర్కవుట్ అయ్యే చాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

.జగన్ తన పాలనను ప్రారంభించి 44 నెలలు అవుతోంది. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు దక్కినా..ఆయనలో మాత్రం ఎక్కడో ఒక అనుమానం. వచ్చే ఎన్నికల్లో గెలవలేనన్న భయం వెంటాడుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో గెలవాలని తెగ తాపత్రయపడుతున్నారు. రెండేళ్ల ముందుగానే పార్టీ నేతలను, అధికారులను ప్రజల్లోకి పంపుతున్నారు. వారితో మమేకం కావాలని సూచిస్తున్నారు. కానీ గతంలో చెప్పిన ఏ పనులు చేయలేదు. ప్రజలను అప్పులపాలు చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. తాను చేసిందేమిటో తెలుసు కనుక ఓటమి తప్పదన్న భయంతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అందుకే వ్యవస్థలను నమ్ముకున్నట్టున్నారు. తన మానస పుత్రికగా భావించే వలంటీర్లపైనే మరో మూడు పర్యవేక్షణ వ్యవస్థలను ప్రవేశపెడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాన్ని జనాలను రప్పించి ఓటు వేయించేందుకు ఓ గ్యాంగ్ ను అధికారికంగా ఏర్పాటుచేసుకుంటున్నారు. వారితోనే ఎలాగైనా గెలవాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించిన సంగతి తెలిసిందే. అయితే వీరిపై నమ్మకం లేకో.. లేకుంటే ప్రజల నుంచి నిలదీతలు; ప్రశ్నలు ఎదురవుతాయన్న భయమో కానీ… వలంటీర్లపై అజమాయిషి, పర్యవేక్షణకు మరికొందర్ని నియమించారు. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి నాయకులు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల్లో 90 శాతం మంది వైసీపీ వాళ్లే అని బాహటంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్ గృహ సారథులను తెరపైకి తెచ్చారు.

ప్రతీ 50 కుటుంబాలకు ఇప్పటికే ఒక వలంటీరు ఉన్నారు. ఇప్పుడు మరో ఇద్దరు గృహ సారథులను నియమిస్తారు. వీరినిపూర్తిగా పార్టీ మనుషులుగానే నియామకాలు చేపట్టనున్నారు. వారు వలంటీర్ల సేవలను పర్యవేక్షిస్తారు. అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తారు. చివరకు వైసీపీకి ఓటు వేసేలా మోటివేషన్ చేస్తారు. అవసరమైతే భయపెడతారు. పథకాలు కట్ చేస్తామంటూ హెచ్చరిస్తారు కూడా. కేవలం భయపెట్టేందుకు గృహ సారథులు వస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచి తిరస్కరణ ఎదురుకాక తప్పదని భావిస్తున్న జగన్ గృహ సారథుల సాయంతో మరోసారి నెట్టుకు రావాలన్న ప్రయత్నం వర్కవుట్ అవుతుందో.. లేకుంటే బెడిసికొడుతుందో చూడాలి మరీ.