సంక్షేమ పథకాలు అమలులో తనకు సాటి లేదని జగన్ నిరూపించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్న జగన్ మాత్రం తన శైలిలో దూసుకెళ్తున్నారు. ప్రతి స్కీం విషయంలోనూ విమర్శలకు దిగుతున్న చంద్రబాబు.. తన మైండ్ గేమ్‌ను అమలు చేయాలని చూస్తున్నారు. కానీ.. వీటన్నింటినీ పట్టించుకోని 0లం.. ఈ కులం అనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను ఆర్థిక ఆదుకుని.. తద్వారా వారు ఆర్థిక స్వావలంబన సాధించాలనే దిశగా సీఎం జగన్ వైఎస్సార్ చేయూత పథకం అమల్లోకి తెచ్చారు. ఈ స్కీం ద్వారా లబ్ధిదారులకు రూ.75 వేల ఆర్థిక సాయం ఇస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు ఈ స్కీంకు అనర్హులుగా ఉన్న వారి పట్ల జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read : అంతర్వేది ఎపిసోడ్: వైసీపీ వ్యూహాత్మక చర్యలు
ప్రధానంగా బుడిగె జంగాలు, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతో ఒకరియా కులాలు ఈ స్కీంకు నోచుకోవడం లేదు. ప్రధానంగా వీరికి కులధ్రువీకరణ పత్రాలు లేవు. ఎప్పటి నుంచో వాటిని జారీ కూడా చేయడం లేదు. దీంతో వీరికి ఎలాంటి కుల ధ్రువీకరణ పత్రాలు లేకున్నా ఈ వైఎస్సార్ చేయూత పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు.
ఇటీవల ఈ నాలుగు కులాలకు సంబంధించిన సమస్యను కొందరు మంత్రులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన కేబినెట్‌లోనూ ఈ సమస్యపై చర్చించారు. కుల ధ్రువీకరణ పత్రం లేని కారణంగా లబ్ధిపొందలేకపోతున్నారని సీఎంకు చెప్పారు. దీంతో సీఎం వెంటనే కీలక నిర్ణయం వెల్లడించారు. స్వయం కుల ధ్రువీకరణ పత్రంతోనే అర్హులకు వైయస్సార్ చేయూత పథకం అందించాలని ఆదేశించారు. త్వరితగతిన ఈ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. దీంతో అధికారులు లబ్ధిదారుల జాబితా తయారు చేసే పనిలో పడ్డారు.
వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా 25 లక్షల మంది మహిళల కోసం ఈ ఏడాది రూ.4,700 కోట్లు కేటాయించింది.ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు గల బీసీ ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లపాటు ఆర్థిక సహాయం అందించనున్నారు. మొత్తం వారికి రూ.75 వేల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఆగస్టు 12, 2020 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించగా.. ఇప్పటికే ఏపీ సర్కార్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఇక ఇప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటే బుడిగె జంగాలు, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతో ఒరియా కులాల వారికీ ఈ పథకం వర్తించనున్నట్లు సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. లబ్ధిదారుల జాబితాను కూడా రెడీ చేస్తున్నట్లు చెప్పారు.
Also Read : ‘చలో అంతర్వేది’ భగ్నం.. బీజేపీ, జనసేన నేతల నిర్బంధం