కాంగ్రెస్ దయ వల్లే కేసీఆర్ కు ఇంత క్రెడిటా?

ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. కాంగ్రెస్ వల్లే ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ సీఎం సీటులో కూర్చున్నారు. కాంగ్రెస్ వల్లే ఒక రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఆ కాంగ్రెస్ నేతల దయవల్లే జాతీయ స్థాయిలో కేసీఆర్ అన్న గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన మాటల్లో నిజంగానే లాజిక్ ఉంది. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా పీవీకి భారతరత్న అంటూ హల్ చల్ చేస్తున్న కేసీఆర్ పై ఇప్పుడు జగ్గారెడ్డి చేసిన […]

Written By: NARESH, Updated On : September 9, 2020 4:59 pm

kcr, congress

Follow us on


ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. కాంగ్రెస్ వల్లే ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ సీఎం సీటులో కూర్చున్నారు. కాంగ్రెస్ వల్లే ఒక రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఆ కాంగ్రెస్ నేతల దయవల్లే జాతీయ స్థాయిలో కేసీఆర్ అన్న గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన మాటల్లో నిజంగానే లాజిక్ ఉంది. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా పీవీకి భారతరత్న అంటూ హల్ చల్ చేస్తున్న కేసీఆర్ పై ఇప్పుడు జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ ఏం చేసిందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కానీ దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. 
  కాంగ్రెస్ వల్లే కేసీఆర్ ఇంత ఎదిగారంటూ చరిత్రను తవ్వారు..

Also Read: కేసీఆరా..మజాకా? మొత్తం బుల్లెట్ ఫ్రూఫ్ పో..!

నిజానికి కేసీఆర్ ను కాంగ్రెస్ కేంద్రమంత్రిని చేయడం వల్లే ఎదిగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మన్మోహన్ హయాంలో కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఎంపీ అయ్యి ఢిల్లీలో కార్మికశాఖమంత్రి అయ్యారు. జాతీయ స్థాయిలో నేతగా గుర్తింపు పొందారు. సోనియా, రాహుల్ గాంధీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం వల్లే ఈరోజు  కేసీఆర్ ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే కాంగ్రెస్ పొరపాట్లే వల్లే కేసీఆర్ ఎదిగారు. ఇందులో కేసీఆర్ చాణక్యం ఎంత ఉన్నా.. కాంగ్రెస్ ఫెయిల్యూర్ కూడా అంతే ఉంది. కానీ అసెంబ్లీ సాక్షిగా  కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ కేసీఆర్ అనడంతో కాంగ్రెసోళ్ల ఇగో హర్ట్ అయ్యింది. అందుకే జగ్గారెడ్డి కాస్త కఠువుగానే ‘పెట్టిన ఇంట్లనే కన్నం పెట్టి పాలు తాగి రోమ్ము కోసే చరిత్ర టీఆర్ఎస్ ది’ అని కేసీఆర్ ను ఎండగట్టారు.
ఇక కేసీఆర్ నెత్తిన ఎత్తుకున్న పీవీ కూడా కాంగ్రెస్ వాదియే కావడం గమనార్హం.  పీవీని ప్రధానిని చేసింది ఆనాడు సోనియానే.. ఇప్పుడు కేసీఆర్ ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ హైజాక్ చేస్తున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో మీడియాను కేసీఆర్ సగం కొనేశాడని.. మిగిలిన సగాన్ని కూడా అసెంబ్లీ బయటకు వెళ్లగొట్టేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇక కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే నవ్వుల పాలవుతారని అన్నారు. మాయవతి, శరద్ పవార్ లకే ప్రధాని పదవి సాధ్యం కాలేదని అన్నారు. కేసీఆర్ వెంట ప్రాంతీయ పార్టీలు కలిసిరావని స్పష్టం చేశారు. మమత విలాసవంతమైన కేసీఆర్ కు మద్దతు ఇవ్వరని స్పష్టం చేశారు.

Also Read: కరోనాను మించి.. ముందుంది ముసళ్ల పండుగ

ఇలా కాంగ్రెస్ పై అసెంబ్లీలో టార్గెట్ చేసిన కేసీఆర్.. ఆ పార్టీ వల్లే ఎదిగాడన్న చిన్న లాజిక్ మరిచిపోయాడు. కానీ రాజకీయాల్లో అవసరార్థం చాలామంది మోసం  చేస్తారు.. మోసపోవడమే పెద్ద తప్పు అని కాంగ్రెస్ వాళ్లు ఎప్పుడు గ్రహిస్తారో మరీ..