
కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం నుంచి ఏడు కిలో మీటర్ల పరిధిని పరిధిని బఫర్ జోన్ గా ప్రకటిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం కూడా ఈ బఫర్ జోన్ లో పరిధిలో ఉంది.
సంఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే గుంటూరు జిల్లా, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డోలాస్ నగర్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. దీంతో పురపాలక, వైద్య ఆరోగ్య, పోలీసుల శాఖల అధికారులు అప్రమత్తం అయ్యాయి. పాజిటివ్ కేసు నమోదు అయిన గ్యాలక్సీ అపార్ట్ మెంట్ నుంచి ఇరువైపులా ఒక మూడు కిలో మీటర్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిషేధించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అవసరమైన నిత్యావసర వస్తువులు అన్ని ఇళ్ల వద్దకే తీసుకువచ్చి అందజేస్తామని పోలీసులు చెప్పారు. మరోవైపు పాజిటివ్ కేసు నమోదు అయిన ప్రాంతం మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించిన అధికారులు. ఒక కిలో మీటరు పరిధి హై రిస్క్ జోన్ గా ప్రకతించారు.
ఇప్పటికే గుజరాత్ సీఎం విజయ్ రూపాని స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. ఆయనను కలిసిన ఒక ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలడంతో సీఎం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పరీక్షల ఆనంతరం సీఎంకు కరోనా పాజిటివ్ లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా రూపాని స్వీయనిర్బంధంలో కొనసాగుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం బఫర్ జోన్ లో ఉండటంతో జిల్లా ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.