https://oktelugu.com/

సి.సి.సి కి కాజల్ అగర్వాల్ విరాళం

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా దెబ్బకు అన్ని స్తంభించిపోయాయి. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పెను ప్రభావం చూపిస్తుంది. సినిమా రంగం పై కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. సినీ కార్మికులు షూటింగ్ లు లేక చాలా ఇబ్బందుకు పడుతున్నారు. సినీ కార్మికుల ఆకలి కేకలు విని వారిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసెస్ చారిటీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు తమ వంతు సాయం గా సి సి […]

Written By: , Updated On : April 16, 2020 / 01:36 PM IST
Follow us on


ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా దెబ్బకు అన్ని స్తంభించిపోయాయి. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పెను ప్రభావం చూపిస్తుంది. సినిమా రంగం పై కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. సినీ కార్మికులు షూటింగ్ లు లేక చాలా ఇబ్బందుకు పడుతున్నారు. సినీ కార్మికుల ఆకలి కేకలు విని వారిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసెస్ చారిటీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు తమ వంతు సాయం గా సి సి సి కి విరాళాలు అందిస్తున్నారు. కొంతమంది నిత్యావసర సరుకులను అందిస్తూ సాయం చేస్తున్నారు.

కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు తనవంతు సాయంగా కథానాయిక కాజల్ అగర్వాల్ 2 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మేనేజర్ గిరిధర్ మాట్లాడుతూ సి సి సి కి ఆర్టీసీ ద్వారా గురువారం నాడు ఆర్టిజిఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసామని చెప్పారు.