https://oktelugu.com/

 సీఎం జగన్ గొప్ప మనసు.. కన్నీళ్లు పెట్టుకున్న బాలు తనయుడు ఎస్పీ చరణ్

ప్రముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటతో యావత్ భారతాన్ని ఆకట్టుకున్నారు.. తెలుగులోనే కాదు.. దేశంలోనే దాదాపు అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన ఘనత ఎస్పీ సొంతం. ఈ మధ్యే  కరోనా బారిన పడి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. Also Read: జగన్ సర్కార్ కు షాకిచ్చిన ఏపీ హైకోర్టు కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. కోలుకుంటున్నారని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో సెప్టెంబర్ 25న కన్నుమూశారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2020 / 11:32 AM IST
    Follow us on

    ప్రముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటతో యావత్ భారతాన్ని ఆకట్టుకున్నారు.. తెలుగులోనే కాదు.. దేశంలోనే దాదాపు అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన ఘనత ఎస్పీ సొంతం. ఈ మధ్యే  కరోనా బారిన పడి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

    Also Read: జగన్ సర్కార్ కు షాకిచ్చిన ఏపీ హైకోర్టు

    కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. కోలుకుంటున్నారని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో సెప్టెంబర్ 25న కన్నుమూశారు. అయితే, ఎస్పీ బాలుకు అరుదైన గౌరవం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నెల్లూరులోని ప్రభుత్వ సంగీత మరియు నృత్య పాఠశాలకు ఆయన పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

    ఇకపై డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. ఇక, ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌.. మంత్రి గౌతమ్ రెడ్డికి ట్వీట్‌ను రీట్వీట్ చేసి.. ఏపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

    నెల్లూరులోని మ్యూజిక్‌, డ్యాన్స్‌ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్‌ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎస్పీ చరణ్‌. కాగా.. మరోవైపు.. ఎస్పీ బాలుకు భారతరత్న ప్రకటించాలని కేంద్రప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే..

    ఎస్పీ చరణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని మ్యూజిక్, డాన్స్ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టడం వల్ల ఆయన కుమారుడు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవం అంటూ చెప్పుకొచ్చారు.

    Also Read: పదో తరగతి పాసైన విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్ష వాయిదా..?

    బాలుకు భారత రత్న ఇవ్వమని కూడా జగన్ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా ఆ విధంగా స్పందించి చర్యలు తీసుకుంటే మన బాలూ భారత రత్నమే అవుతారు. బాలు పుట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన వారు అయిన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయనకు బాలూ అంటే చాలా ఇష్టం. అందువల్ల కేంద్ర పెద్దలతో ఆయన చర్చలు జరిపి ఈ గొప్ప గౌరవం బాలూకి దక్కేలా చూస్తారని ఆయనకు ఉన్న కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

    అయితే ఇందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు చరణ్. అయితే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని ప్రభుత్వ సంగీత, నృత్య పాటశాల కి గనగందర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరు చేరుస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్