జగన్ సంచలన నిర్ణయం… ఏపీ మహిళలకు శుభవార్త!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళల సంక్షేమం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అడుగులు వేస్తున్నారు. సీఎం జగన్ ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ద్వారా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 18,500 రూపాయలు ఖాతాలలో జమ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అందజేసిన నగదుతో చాలా మంది మహిళలు సొంతంగా చిన్నచిన్న వ్యాపారాలను ప్రారంభించారు. Also Read : వైఎస్ వివేకా హత్య: కీలక సమాచారం […]

Written By: Navya, Updated On : September 26, 2020 2:08 pm
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళల సంక్షేమం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అడుగులు వేస్తున్నారు. సీఎం జగన్ ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ద్వారా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 18,500 రూపాయలు ఖాతాలలో జమ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అందజేసిన నగదుతో చాలా మంది మహిళలు సొంతంగా చిన్నచిన్న వ్యాపారాలను ప్రారంభించారు.

Also Read : వైఎస్ వివేకా హత్య: కీలక సమాచారం చెప్పిన ఆ ఇద్దరు మహిళలు?

వీరికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో సీఎం జగన్ చిరు వ్యాపారుల కోసం వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకునేలా అడుగులు వేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్‌ ఇందుకోసం కంపెనీలు, కార్పొరేషన్ల ఎండీలు లబ్ధిదారులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సార్ చేయూత పథకానికి అర్హులైన వారికి 75,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు జగన్ సర్కార్ హామీ ఇచ్చింది.

ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు జగన్ సర్కార్ ఇప్పటికే 18,500 రూపాయలు తొలి విడత సాయం అందించింది. చాలామంది ఈ డబ్బుతో కిరాణా దుకాణాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విధంగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వం వివిధ కంపెనీల ఔట్ లెట్స్ ద్వారా సరుకుల సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకుంటోంది.

వీడియో కాన్ఫరెన్స్ లో హిందుస్థాన్‌ లీవర్‌ కంపెనీ ప్రతినిధులు రవాణా ఖర్చులను సైతం తామే భరించి సరుకుల రవాణా చేస్తామని వెల్లడించారు. కొన్ని కంపెనీలు డెలివరీ చేసిన ఉత్పత్తులు మూడు నెలల్లో సేల్ కాకపోతే రిటర్న్ తీసుకోవడానికి కూడా అంగీకరించడం గమనార్హం. పీఅండ్‌జీ, ఐటీసీ, పలు కంపెనీలు అవసరమైతే రుణ సాయం కూడా చేస్తామని చెప్పాయి. మహిళలకు ప్రయోజనం చేకూరేలా జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : డ్రగ్స్ కేసులో రకుల్ నలుగురు స్టార్ల పేర్లు బయటపెట్టిందా?