https://oktelugu.com/

డెంగ్యూ ప్రాణాలకే ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరినీ ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వర్షాకాలంలో చాలామంది సీజనల్ వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వ్యాధులు వర్షాకాలంలో వేగంగా విజృంభిస్తూ ఉంటాయి. అయితే వ్యాధి లక్షణాలను గుర్తించి సకాలంలో చికిత్స చేయించుకుంటే నష్టం లేదు కానీ లేకపోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. Also Read : అలెర్ట్: మరో 24 గంటలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 26, 2020 / 09:43 AM IST
    Follow us on

    వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరినీ ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వర్షాకాలంలో చాలామంది సీజనల్ వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వ్యాధులు వర్షాకాలంలో వేగంగా విజృంభిస్తూ ఉంటాయి. అయితే వ్యాధి లక్షణాలను గుర్తించి సకాలంలో చికిత్స చేయించుకుంటే నష్టం లేదు కానీ లేకపోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

    Also Read : అలెర్ట్: మరో 24 గంటలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

    ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు ఎక్కువగా వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. వ్యాధి లక్షణాలను మనం ముందుగానే గుర్తిస్తే రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. డెంగ్యూ బారిన పడ్డ వారిలో ప్లేట్ లెట్స్ క్రమంగా తగ్గిపొతాయి. దోమల వల్ల ఈ వ్యాధి బారిన పడతాం కాబట్టి ఇంట్లోకి దోమలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పడుకునే సమయంలో దోమలు కుట్టకుండా చేతులు, కాళ్లు కవర్ అయ్యేలా చూసుకోవాలి.

    ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవడం దోమల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అయితే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో డెంగ్యూ బారిన పడే అవకాశం ఉంటుంది. దగ్గు, జలుబు, కడుపులో నొప్పి, చర్మ సంబంధిత సమస్యలు, తలనొప్పి, చిగుళ్ల సమస్యలు, విరేచనాలు, వాంతులు, జ్వరం లాంటి లక్షణాలు డెంగ్యూ బారిన పడ్డ వారిలో కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు అందరిలో ఒకే విధంగా ఉండవని రోగి శరీరతత్వాన్ని బట్టి మారతాయని వైద్యులు చెబుతున్నారు.

    ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. వీలైనంత వరకు బయటి ఆహారం తీసుకోకూడదు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటే మరీ మంచిది. సీజనల్ ఫ్రూట్స్, సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటూ వీలైనంత వరకు కాచి చల్లార్చిన నీటిని తగ్గితే డెంగ్యూ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. డెంగ్యూకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

    Also Read : వైఎస్ వివేకా హత్య: కీలక సమాచారం చెప్పిన ఆ ఇద్దరు మహిళలు?